News February 19, 2026

విశాఖలో AI హబ్: సుందర్ పిచాయ్

image

ఢిల్లీలో జరుగుతున్న AI సమ్మిట్‌లో పలువురు ప్రముఖులు ప్రసంగించారు. విశాఖపట్నం సహా పలు ప్రాంతాల్లో గూగుల్ AI హబ్‌లను ఏర్పాటు చేస్తోందని కంపెనీ CEO సుందర్ పిచాయ్ తెలిపారు. మానవాళికి AI చాలా ఉపయోగకరంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. టాటా గ్రూప్ AIని చాలా వేగంగా అమలు చేస్తున్నట్లు ఛైర్మన్ చంద్రశేఖరన్ వెల్లడించారు. కొత్త టెక్నాలజీని అందరికీ చేర్చడమే మోదీ లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

Similar News

News April 17, 2026

జగన్ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి

image

YCP చీఫ్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు CBI కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ నెల 20 నుంచి మే 15వ తేదీ మధ్య 2 వారాలు యూరప్, యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోర్టును కోరారు. సానుకూలంగా స్పందించిన కోర్టు రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. అలాగే విదేశాల నుంచి వచ్చాక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరు కావాలంది. పర్యటన వివరాలు కోర్టు, CBIకి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

News April 17, 2026

కూటమి ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తున్నారు: మిథున్ రెడ్డి

image

లోక్‌సభలో ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా YCP MP మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏపీలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయింది. నలుగురు కూటమి ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తూ పట్టుబడ్డారు. అసభ్యకరమైన వీడియోలు బయటపడ్డాయి. అయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫిర్యాదు చేసిన మహిళలనే టార్గెట్ చేసి వేధిస్తున్నారు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’ అని డిమాండ్ చేశారు.

News April 17, 2026

ప్రభాస్ కటౌట్‌కు తగ్గట్టుగా ‘ఫౌజీ’!

image

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ కోసం డైరెక్టర్ హను మునుపెన్నడూ లేని విధంగా నెక్స్ట్ లెవెల్ మాస్ ఎలివేషన్స్, సాలిడ్ యాక్షన్ సీన్స్ డిజైన్ చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. డార్లింగ్ కటౌట్‌కు తగ్గట్టుగా మాస్ యాంగిల్‌ను హను చూపించబోతున్నారని సమాచారం. ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.