News February 19, 2026
త్వరలో DSC.. కర్నూలు జిల్లాకు అధిక ప్రాధాన్యం: మంత్రి లోకేశ్

కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం చాలా వెనుకబడి ఉందని, యువగళం పాదయాత్రలో కళ్లారా చూశానని మంత్రి లోకేశ్ అసెంబ్లీలో అన్నారు. ‘ఆ ప్రాంతాన్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో పెద్దఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చే లక్ష్యంతో పని చేస్తున్నాం. గత DSCలో ఆ జిల్లాకు ఎక్కువ మంది టీచర్లను నియమించాం. అయినా స్టూడెంట్, టీచర్ రేషియో తక్కువగా ఉంది. త్వరలో DSC ప్రకటించబోతున్నాం. జిల్లాకు అధిక ప్రాధాన్యం ఇస్తాం’ అని చెప్పారు.
Similar News
News February 20, 2026
అనకాపల్లి: ‘తాళం వేసిన ఇళ్లే నేరగాళ్ల లక్ష్యం’

తాళం వేసిన ఇండ్లనే నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారని అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా పేర్కొన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఊర్లకు వెళ్లే వారు తప్పనిసరిగా ఎల్‌హెచ్‌ఎంఎస్‌లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. ప్రతి కాలనీ, వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. అనుమానాస్పదం కలిగేలా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
News February 20, 2026
రిటైర్డ్ ఏఆర్ ఎస్సై మృతి బాధాకరం: హరీష్‌రావు

రిటైర్మెంట్ బకాయిలు అందక ఆర్థిక ఇబ్బందులతో విశ్రాంత ఏఆర్ ఎస్సై మైసయ్య మృతి చెందడంపై మాజీ మంత్రి హరీష్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుమారు రూ.60 లక్షల బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో, వైద్య ఖర్చులు భరించలేక ఆయన మరణించడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. బాధిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందించాలని, రాష్ట్రవ్యాప్తంగా రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
News February 20, 2026
పెద్దపల్లిలో 24న జాబ్ మేళా.. 51 ఉద్యోగావకాశాలు

PDPL జిల్లా ఉపాధి కార్యాలయంలో FEB 24న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రాజశేఖర్ తెలిపారు. సాక్సెస్ ప్రాజెక్టు ఎల్‌ఎల్‌పి సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ 50, మార్కెటింగ్ మేనేజర్ 1 పోస్టు ఖాళీగా ఉంది. 10వ తరగతి నుంచి డిగ్రీ, ఎంబీఏ అర్హతలతో 18-36 ఏళ్ల అభ్యర్థులు పాల్గొనవచ్చు. నూతన కలెక్టర్ భవనం, రూమ్ నం.233లో సర్టిఫికేట్ల జిరాక్స్‌లతో హాజరుకావాలని సూచించారు.


