News February 19, 2026

లోకగమనానికి మూలాధారాలు

image

వేదమూల మిదం బ్రాహ్మం, భార్యామూల మిదం గృహం|
కృషిమూల మిదం ధాన్యం, ధనమూల మిదం జగత్||
‘ధనం మూలం ఇదం జగత్’ అనే మాట ఈ శ్లోకం నుంచే వచ్చింది. ఈ శ్లోకార్థం.. ‘బ్రాహ్మణత్వానికి వేదాలు, గృహానికి గృహిణి, పంటకు కృషి ఎలా ఆధారమో ఈ లోక వ్యవహారాలన్నింటికీ ధనమే మూలం. డబ్బుతో పాటు సంస్కారం, కుటుంబం, కష్టం కూడా జీవితానికి ముఖ్యమే. మన నిత్య జీవితంలో వాడే ఓ చిన్న నానుడి వెనుక ఇంతటి లోతైన అర్థం, ధర్మ సూత్రం ఉంది.

Similar News

News April 18, 2026

అప్పుల్లో గేల్.. తానే సాయం చేశానన్న లలిత్ మోదీ

image

2011 ఆక్షన్‌లో అన్‌సోల్డ్‌గా మిగిలిన గేల్‌ను జట్టులోకి తీసుకొమ్మని RCBకి చెప్పింది తానేనని IPL మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ వెల్లడించారు. ‘వేలంలో గేల్ అమ్ముడుపోలేదు. ఎన్ని ఫ్రాంచైజీలను సంప్రదించినా నో అన్నారని నాకు ఫోన్ చేసి చెప్పాడు. అప్పులున్నాయి.. ఎలాగైనా ఆడాలని అన్నాడు. ఇంజూరీ ప్లేయర్‌ స్థానంలో తీసుకొమ్మని విజయ్ మాల్యాను రిక్వెస్ట్ చేశా’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. 2011లో గేల్ 608 రన్స్ చేశారు.

News April 18, 2026

బోల్డ్ ఫొటోకు కోహ్లీ లైక్.. మోడల్ ఏమన్నారంటే?

image

విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టా ఫొటోను <<19671107>>లైక్<<>> చేసి తర్వాత అన్‌లైక్ చేయడంపై జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ లిజ్‌లాజ్ స్పందించారు. ‘విరాట్ నా ఫొటోకి లైక్ చేసినప్పుడు ఎంతో సంతోషించా. దానివల్ల SMలో ఇంతగా వైరల్ అవుతానని అనుకోలేదు. ఆ ఫొటోకు లైక్ చేయడంలో ఆయనకు దురుద్దేశం లేకపోయినా నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇది చూసి ఆయనపై కాస్త జాలి కలిగింది. కోహ్లీ నుంచి లభించిన మద్దతుకు ధన్యవాదాలు’ అని తెలిపారు.

News April 18, 2026

నటిపై పరువు నష్టం దావా వేసిన చాహల్

image

తన పరువుకు భంగం కలిగించేలా SMలో పోస్ట్‌లు, మీడియా ముందు మాట్లాడినందుకు నటి తానియా <<19636894>>ఛటర్జీపై<<>> టీమిండియా క్రికెటర్ చాహల్ సీరియస్ అయ్యారు. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తూ.. వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని ఆమెపై పరువు నష్టం దావా వేశారు. దీనిపై తానియా స్పందిస్తూ.. ‘ఇది హాస్యాస్పదంగా ఉంది. ఇది ఇంత వైరల్ అవుతుందని అనుకోలేదు. దీనివల్ల నేనే ట్రోలింగ్‌కు గురయ్యా’ అని ఆవేదన వ్యక్తం చేశారు.