News February 19, 2026

ఈస్ట్ HYDకు ‘కిక్’.. రూ.25 కోట్లతో భారీ స్పోర్ట్స్ కాంప్లెక్స్..!

image

నగర తూర్పు దిక్కున ఇక ఆటల జాతర షురూ కాబోతోంది. ఉప్పల్, శివారు ప్రాంతాల రూపురేఖలు మార్చేలా 10ఎకరాల విస్తీర్ణంలో రూ.25కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇండోర్, అవుట్ డోర్ గేమ్స్‌తో పాటు అంతర్జాతీయ స్థాయి వసతులూ రానున్నాయి. ఈ ప్రాజెక్టుతో ఈస్ట్ HYD స్పోర్ట్స్ హబ్‌గా మారడమే కాకుండా, స్థానిక రియల్ ఎస్టేట్‌కు మంచి బూస్ట్ లభించనుంది.

Similar News

News April 20, 2026

కొడంగల్‌: CM ఇలాకాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రూ.224 కోట్లతో 450 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని పెద్ద సర్కార్ దవాఖానాలైన గాంధీ (2,000+ పడకలు), ఉస్మానియా (1,168+ పడకలు) తర్వాత, ప్రాంతీయ స్థాయిలో ఇంతటి ఆధునిక వైద్యశాల రావడం ఇదే తొలిసారి. ఈ భారీ నిర్మాణం పూర్తయితే కొడంగల్‌తో పాటు పరిసర జిల్లాలకు ఎంతో ఉపయోగపడనుంది.

HYDలో త్వరలో మరో IVF సెంటర్

image

HYD హైకోర్టు సమీపంలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో త్వరలో IVF కేంద్రం అందుబాటులోకి రానుంది. గాంధీ ఆసుపత్రిలో IVF సెంటర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇక్కడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు DME నరేందర్ కుమార్ తెలిపారు. సుమారుగా 490 పడకల సామర్థ్యంతో, డాక్టర్లతో అద్భుతమైన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయడం, పసిపిల్లలకు వైద్యం, పిల్లల తల్లులకు అడ్వాన్స్‌డ్ వైద్యం అందించనున్నారు.