News May 2, 2024
అనంత జిల్లా వ్యాప్తంగా 70 శాతం పింఛన్ల పంపిణీ

జిల్లా వ్యాప్తంగా సామాజిక పింఛన్ల పంపిణీ 70శాతం పూర్తిచేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పింఛన్‌దారుల ఖాతాల్లోకి మొదటి రోజే దాదాపు నగదు జమ చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో 2,88,334 మందికి రూ.86.332 కోట్ల పింఛన్ మొత్తం విడుదలైందన్నారు. ఆధార్ అనుసంధానమైన 2,02,716 మంది పింఛన్‌దారులకు ఖాతాల్లోకి రూ.60.815 కోట్లు జమ చేస్తామన్నారు. 85,618 మంది ఇళ్ల వద్దకు వెళ్లి రూ. 25.517 కోట్లు పంపిణీ చేశామన్నారు.
Similar News
News March 18, 2026
కందుకూరు లేఅవుట్ పనులు జూన్ లోపు పూర్తి చేయాలి: జేసీ

అనంతపురం రూరల్ పరిధిలోని కందుకూరు అహుడా లేఅవుట్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను జేసీ విష్ణుచరణ్ పరిశీలించారు. డ్రైనేజీలు, రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నీటి సరఫరా, పార్క్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్ నెలలోపు అన్ని పనులు పూర్తి చేయాలని, పక్షం రోజులకు ఒకసారి పురోగతి నివేదిక సమర్పించాలని సూచించారు. కార్యక్రమంలో అహుడా అధికారులు పాల్గొన్నారు.
News March 18, 2026
ఉగాది పండుగను ఘనంగా నిర్వహిద్దాం: డీఆర్‌వో

నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను ఘనంగా నిర్వహిద్దామని డీఆర్‌వో మలోల పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం రెవెన్యూ భవనంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. మొదట వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, భక్తి గీతాలపన, పంచాంగ శ్రవణం, సంప్రదాయ నృత్య ప్రదర్శన ఉంటాయన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలన్నారు.