News February 19, 2026

సెన్సెక్స్ 750 పాయింట్లు డౌన్.. కారణాలివే

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లోకి కూరుకుపోయాయి. మూడు రోజుల వరుస లాభాల నేపథ్యంలో ప్రాఫిట్ బుకింగ్, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, ఆయిల్ ధరల పెరుగుదల వంటివి సూచీలను కిందకు లాగాయి. సెన్సెక్స్ 759 పాయింట్లు పతనమై 82,974 వద్ద, నిఫ్టీ 211 క్షీణించి 25,607 దగ్గర కొనసాగుతున్నాయి. సెన్సెక్స్-30 సూచీలో ఇన్ఫీ, TCS షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. KWIL, ట్రెంట్ షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Similar News

News April 17, 2026

సౌత్ vs నార్త్ అంటూ దేశాన్ని ముక్కలు చేస్తామంటే కుదరదు: షా

image

ఉత్తర, దక్షిణ భేదాలు చూపి దేశాన్ని ముక్కలు చేస్తామంటే కుదరదని కేంద్రమంత్రి అమిత్ షా డీఎంకేని ఉద్దేశించి LSలో వ్యాఖ్యానించారు. ‘డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదు. దక్షిణమే కాదు యూటీలకు సైతం దేశంపై అదే హక్కు ఉంటుంది. కరోనా కారణంగా 2021లో జనగణన చేయలేకపోయాం. ఇప్పుడు అందరి సూచనలతో చేస్తున్నాం. డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో సీట్లు పెరుగుతాయి’ అని తెలిపారు.

News April 17, 2026

తగ్గేదేలే.. లూసిఫర్-3 కచ్చితంగా చేస్తా: పృథ్వీరాజ్

image

ఒకట్రెండు కమిట్‌మెంట్లు పూర్తయిన తర్వాత లూసిఫర్-3ని కచ్చితంగా తీస్తానని నటుడు, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ వెల్లడించారు. మోహన్ లాల్ డేట్స్ కుదరడమూ ముఖ్యమని పేర్కొన్నారు. ‘L2: ఎంపురాన్’ సినిమా కొద్ది మందికి నచ్చకపోయినా తన నిబద్ధత తగ్గదని చెప్పారు. ఆ చిత్రంలో <<15958942>>గుజరాత్ అల్లర్ల ప్రస్తావనపై<<>> స్పందిస్తూ ‘రాజకీయ ప్రయోజనాల కోసం రూ.కోట్లు పెట్టి సినిమా తీసే వ్యక్తిని కాదు’ అని స్పష్టం చేశారు.

News April 17, 2026

డీలిమిటేషన్.. పాకిస్థాన్‌కు భారత్ వార్నింగ్

image

డీలిమిటేషన్ బిల్లులో J&K అసెంబ్లీలో <<19661636>>POKకు 24 సీట్లను<<>> కేంద్రం రిజర్వ్ చేయడాన్ని రెచ్చగొట్టే చర్యగా పాక్ విమర్శించింది. దీనిపై భారత్ ఘాటుగా స్పందించింది. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. భారత సార్వభౌమాధికారంలో భాగంగా పరిపాలనా, శాసనపరమైన ప్రక్రియలపై నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేసింది. ఇందులోకి చొరబడే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికింది.