News February 19, 2026
ప్రతి జిల్లాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్: హోంమంత్రి అనిత

సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రతి జిల్లాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. గురువారం శాసనసభలో మాట్లాడారు. సైబర్ వర్టికల్ వింగ్ ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు పంపించామన్నారు. రూ.2కోట్లతో అధునాతనమైన సైబర్ ఫోరెన్సిక్ పరికరాలను సమకూరుస్తున్నామని చెప్పారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
Similar News
News February 21, 2026
కేంద్ర పథకాల నిధులను వంద శాతం వినియోగించాలి: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్‌లో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల వినియోగంపై కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖలకు మంజూరైన నిధులు, ఇప్పటివరకు జరిగిన ఖర్చు, పురోగతిలో ఉన్న పనుల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. నిధులను నిర్దేశిత గడువులోగా నూరు శాతం ఖర్చు చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం లేకుండా పారదర్శకతతో లక్ష్యాలను చేరుకోవాలని ఆమె స్పష్టం చేశారు.
News February 21, 2026
డిప్యూటీ సీఎం పర్యటనకు పటిష్ఠ భద్రత: ఎస్పీ

గంభీరావుపేట మండలంలో ఆదివారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రుల బృందం పర్యటించనున్న నేపథ్యంలో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ మహేశ్ బి.గితే తెలిపారు. శనివారం ఆయన అధికారులతో కలిసి హెలిప్యాడ్, సభా ప్రాంగణాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు.
News February 21, 2026
KMR: ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడిని ఖండించిన కేంద్రమంత్రి

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంప్ ఆఫీస్ పై దాడిని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఖండించారు. ప్రజాపాలన అంటే ఇదేనా! ఇటువంటి దాడులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడికి దిగడం తగదని, ఎమ్మెల్యేకు రక్షణ లేకపోతే, సాధారణ మనిషి రక్షణ ఎక్కడుందని? దీనికి సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. శాంతిభద్రతలను కాపాడాలని, రాజకీయ హింసను ప్రోత్సహించవద్దని ఆయన కోరారు.


