News May 2, 2024
అనంతపురం జిల్లా టీడీపీ రాష్ట్ర కమిటీలో ముగ్గురికి చోటు

టీడీపీ రాష్ట్ర కమిటీలో అనంతపురం జిల్లా నుంచి ముగ్గురికి అవకాశం దక్కింది. గుంతకల్ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్‌ను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి తమ్మినేని నటేస్ చౌదరి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా, రాయదుర్గం నుంచి మాజీ జడ్పీ ఛైర్మన్ పులా నాగరాజును రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News March 3, 2026
అనంత: జాగ్రత్త.. ఇది డేంజర్ స్పాట్

కళ్యాణదుర్గం మండలం గూబనపల్లి వద్ద హైవే మలుపు డేంజర్ స్పాట్‌గా మారింది. ఇటీవల అక్కడ వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆదివారం కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. 15 రోజుల క్రితం 2 బైకులు డీకొన్న ఘటనలో ఒకరు మరణించారు. నెల రోజుల క్రితం అక్కడే ట్రాక్టర్, కారు డీకొన్నాయి. మలుపు ప్రమాదకరంగా మారడంతోనే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. పోలీసులు తగిన చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
News March 2, 2026
ఇంటర్ ఫస్టియర్ గణితం పరీక్షలకు 408 మంది గైర్హాజరు

అనంతపురం జిల్లాలో నేడు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు గణితం పరీక్ష జరిగింది. పరీక్షలకు సెట్-1 ప్రశ్నపత్రాన్ని వాడినట్లు RIO వెంకటరమణ నాయుడు తెలిపారు. జనరల్ విద్యార్థులు 13,890 గాను 13,621 మంది హాజరు కాగా 269 మంది గైర్హాజరయ్యారన్నారు. ఒకేషనల్ విద్యార్థులు 2,258 గాను 2,119 మంది హాజరు కాగా 139 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. CC కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
News March 2, 2026
ఉగాది నాటికి 16,702 ఇళ్ల పూర్తి లక్ష్యం సాధించాలి: జేసీ

అనంతపురం కలెక్టరేట్‌లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఉగాది నాటికి జిల్లాకు కేటాయించిన 16,702 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. పీఎం ఆవాస్ యోజన 2.0 కింద మంజూరైన ఇళ్ల గ్రౌండింగ్ వేగవంతం చేయాలన్నారు. ఎన్ఆర్ఈజీఏ బిల్లుల అప్లోడ్, స్వామిత్వం, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, సీసీ రోడ్లు, డ్రైన్ల పనుల్లో పురోగతి సాధించాలని సూచించారు.


