News May 2, 2024
జీలుగుమిల్లి గిరిజన సంక్షేమాధికారి సస్పెన్షన్

జీలుగుమిల్లి సహాయ గిరిజన
సంక్షేమాధికారి (ఏటీడబ్ల్యూవో) కె.కృష్ణమోహన్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారని ఆ శాఖ ఉప సంచాలకుడు పీవీఎస్ నాయుడు తెలిపారు. స్థానిక గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలకు చెందిన 42 మంది విద్యార్థులు ఫిబ్రవరిలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. ఆ ఘటనతో పాటు పలు అంశాలపై ఐటీడీఏ పీవో డైరెక్టరేటుకు నివేదిక పంపగా సస్పెండ్ చేసినట్లు డీడీ పేర్కొన్నారు.
Similar News
News March 11, 2026
ప.గో: గ్యాస్ బుకింగ్‌లో కొత్త నిబంధనలు

గ్యాస్ బుకింగ్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు జిల్లాలో వినియోగదారులకు ఇబ్బందికరంగా మారింది. ఓవైపు సిలిండర్ ధరలు పెరగగా మరోవైపు గతంలో సింగిల్ బండ 15 రోజులు బుక్ చేసుకునే సౌకర్యం ఉండేది. కొత్త నిబంధనల ప్రకారం సింగిల్ బండ ఓనర్ 25 రోజుల తర్వాత, డబుల్ బండ వారు 30రోజుల తర్వాత మాత్రమే గ్యాస్ బుక్ చేసుకోవాలని నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధన భారంగా మారిందని వినియోగదారులు వాపోతున్నారు.
News March 11, 2026
ప.గో: అసభ్య పదజాలం.. ఫొటోలతో వివాహితకు బెదిరింపులు

ఫోన్ ద్వారా వివాహితను అసభ్య పదజాలంతో దూషిస్తూ, సోషల్ మీడియాలో ఫొటోలు పెడతానంటూ బెదిరిస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కథనం.. నరసాపురం టౌన్‌లోని ఓ వివాహితను ఏడాదిగా గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ ద్వారా వేదిస్తున్నారు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు నరసాపురం టౌన్ ఎస్ఐ ఎస్.ముత్యాలరావు కేసు నమోదు చేశారు. నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
News March 11, 2026
ప.గో: లైంగిక దాడి కేసులో పదేళ్లు జైలు

మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో యువకుడికి భీమవరం పోక్సో కోర్టు 10 ఏళ్లు జైలు శిక్ష విధించినట్లు పెనుగొండ ఎస్సై గంగాధరరావు తెలిపారు. 2021లో నడిపూడికి చెందిన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన చిల్లే చరణ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి చేసినట్లు కేసు నమోదైంది. తర్వాత నిందితుడు గల్ఫ్ దేశానికి వెళ్లిపోయాడు. శిక్షతో పాటు బాధితురాలికి రూ.1 లక్ష నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు.


