News May 2, 2024
రాజమండ్రి వస్తున్న బస్సులో రూ.2.40 కోట్లు దొరికాయ్..!

హైదరాబాద్ నుంచి రాజమండ్రి వైపు వస్తున్న బస్సులో భారీగా నగదు దొరికింది. ప.గో జిల్లా జగన్నాథపురం చెక్‌పోస్ట్ వద్ద రూ. 2.40 కోట్లు తరలిస్తుండగా పోలీస్ అధికారులు పట్టుకున్నారు. ఓ ప్రైవేట్ బస్సులో ఆ నగదు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు ఎస్సై సతీష్ కుమార్ చెప్పారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News July 7, 2025
జిల్లాలో ఎరువులు కొరత లేదు: జిల్లా వ్యవసాయ అధికారి

తూర్పుగోదావరి జిల్లాలో ఎటువంటి ఎరువుల కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవ రావు సోమవారం తెలిపారు. జిల్లాలో గత ఏప్రిల్ నెల నుంచి ఇప్పటివరకు 35,869 టన్నుల వేర్వేరు రకాల ఎరువులను ప్రైవేటు డీలర్లు, మార్క్ ఫెడ్ ద్వారా రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. ఇందులో యూరియా 15,294 టన్నులు, డీఏపీ 2,615 టన్నులు, పొటాష్ 2,918 టన్నులు, సూపర్ 6,324 టన్నులు ఉన్నాయన్నారు.
News July 7, 2025
2047 నాటికి పేదరికాన్ని నిర్మూలిస్తాం: మంత్రి కందుల

ఆంధ్రప్రదేశ్ విజన్ యాక్షన్ ప్లాన్-2047లో భాగంగా ఉపాధి, సాంఘిక గౌరవం, పేదరిక నిర్మూలన, సుస్థిర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు రూపొందించిన P-4 కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుందని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. సోమవారం నిడదవోలులో మంత్రి మాట్లాడారు. 2047 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలనే దీర్ఘకాలిక లక్ష్యంతో P-4 రూపొందించినట్లు చెప్పారు.
News July 7, 2025
రాజమండ్రి: ఈ నెల 12 వరకు రాబిస్ వ్యాధి నివారణ డ్రైవ్

జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 5- 12వ తేదీ వరకు రాబిస్ వ్యాధి నివారణ డ్రైవ్ నిర్వహించినట్లు DMHO వెంకటేశ్వరరావు తెలిపారు. రాజమండ్రిలో ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిల్లో 12వ తేదీ వరకు ఉచితంగా రాబిస్ వ్యాక్సిన్ అందిస్తారన్నారు. కుక్క కాటుకి గురైన వ్యక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందస్తు వ్యాక్సిన్‌తో రాబిస్ నుంచి రక్షణ పొందవచ్చు అన్నారు.