News May 2, 2024

నెల్లూరు: 41.7 డిగ్రీల ఎండతో జనం విలవిల

image

నెల్లూరులో బుధవారం 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రతకు జనం విలవిలలాడుతున్నారు. ఉదయం 9 గంటలకే సూర్యప్రతాపం తీవ్రమవుతుండటంతో ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. 11 గంటలకు ఖాళీ అవుతున్న రోడ్లు తిరిగి సాయంత్రం 5 గంటల తర్వాతే రాకపోకలతో రద్దీగా కనిపిస్తున్నాయి. రోడ్ల పక్కన చిరువ్యాపారులు చేసుకునేవారు. రోజు కూలీలు మాత్రం విధిలేని పరిస్థితుల్లో ఎండలోనే జీవన పోరాటం సాగిస్తున్నారు.

Similar News

News March 16, 2026

‘కౌమార దశలో గర్భధారణ’పై పోస్టర్ విడుదల

image

కౌమార దశలో గర్భధారణకు సంబంధించిన కారణాలు, దుష్ప్రభావాలపై అవగాహన కల్పించే పోస్టర్లను కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ పీడీ హేనా సుజన్ ఆవిష్కరించారు. అనుమానాస్పద సంఘటనలు కనిపించిన వెంటనే ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. కౌమార దశలో ఉన్న బాలికల భవిష్యత్తు రక్షణకు ఈ కార్యక్రమాలు ఉపయోగపడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

News March 16, 2026

నెల్లూరు కార్పొరేషన్‌లో 362 ఫిర్యాదులు

image

నెల్లూరు నగరపాలక సంస్థలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో మేయర్ దేవరకొండ సుజాత అశోక్, అదనపు కమిషనర్ హిమబిందు ప్రజల నుండి వినతులను స్వీకరించారు. మొత్తం 43 వ్యక్తిగత వినతులు, సి.పి.ఎమ్ ఆధ్వర్యంలో వచ్చిన 319 ఫిర్యాదులను స్వీకరించిన అదనపు కమిషనర్, వీటిని నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News March 16, 2026

నెల్లూరు: అనాధ శిశువు గురించి ఎవరికైనా తెలుసా ?

image

ఫోటోలోని అనాధ మగ శిశువును శిశు గృహ నందు సంరక్షణలో ఉన్నట్లు ICDS PD హేనా సుజన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిశువును జన్మనిచ్చిన తల్లిదండ్రులు ప్రచురణ తేదీ నుంచి 30 రోజులలోగా తగిన సాక్ష్యాధారాలతో సహా ICDS PDని సంప్రదించాలని కోరారు. లేని పక్షంలో శిశువును అనాథ శిశువుగా ప్రకటిస్తామన్నారు. అలాగే ప్రభుత్వంచే నిర్దేశించబడిన నియమ నిబంధనల ప్రకారము దత్తతకు ఇవ్వడం జరుగుతుందన్నారు.