News May 2, 2024
చీరాల వాసులకు కీలక హామీలు ఇచ్చిన చంద్రబాబు

చీరాలలో ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చీరల వాసులకు కీలక హామీలు ఇచ్చారు. చీరాలలో చేనేతలకు టెక్స్‌టైల్ పార్కు నిర్మాణం. వాడరేవు బీచ్‌లకు పర్యాటక హబ్‌లుగా అభివృద్ధి. తాగునీటి సమస్య పరిష్కారం. తోటవారి ఎత్తిపోతల పథకానికి సురక్షిత నీరు అందించడం. పేరాల, వైకుంఠపురం రైల్వే బ్రిడ్జిల నిర్మాణం. చీరాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
Similar News
News July 7, 2025
ప్రకాశం: కార్లు అప్పగించలేదంటూ SPకి ఫిర్యాదు.!

మూడు కార్లను బాడుగకు తీసుకొని 7 నెలలుగా బాడుగ డబ్బులు చెల్లించడం లేదని ఓ వ్యక్తి సోమవారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఒంగోలు మారుతి నగర్‌కు చెందిన ఓ వ్యక్తి మూడు కార్లను బాడుగకు మరో వ్యక్తికి అప్పగించాడు. 7 నెలలు పూర్తైనా ఇప్పటివరకు బాడుగ చెల్లించలేదు. అంతేకాకుండా కార్లను అప్పగించకపోవడంతో బాధితుడు, జిల్లా ఎస్పీ దామోదర్‌ను ఆశ్రయించారు. విచారణ చేయాలని ఎస్పీ ఆదేశించారు.
News July 7, 2025
ప్రకాశం: 10 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ASIలుగా పదోన్నతి

ప్రకాశం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్న 10 మందికి ఏఎస్ఐలుగా పదోన్నతి వచ్చింది. వీరిని ఎస్పీ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ మేరకు వారి పదోన్నతికి సంబంధించిన పత్రాలను అందించి ఎస్పీ పలు సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. పదోన్నతి పొందిన ప్రతి ఒక్కరు విధి నిర్వహణలో పేరు ప్రఖ్యాతలు సాధించాలన్నారు.
News July 7, 2025
ఒంగోలు నుంచి వెళ్తుండగా ఉద్యోగి మృతి

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సోమవారం ఉదయం చనిపోయారు. ఒంగోలు నుంచి బైకుపై వెళ్తున్న వ్యక్తి జాగర్లమూడివారిపాలెం బ్రిడ్జి వద్ద హైవేపై చనిపోయారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందా? లేదా అదుపుతప్పి ఆయనే కింద పడిపోయారా? అనేది తెలియాల్సి ఉంది. మృతుడు ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని సమాచారం. ఒంగోలు నుంచి గుంటూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.