News May 2, 2024

సిద్దిపేట: ప్రచారానికి మిగిలింది… ఇంకా 10 రోజులే

image

మెదక్ లోకసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో అభ్యర్థుల ప్రచారం ఒక్కసారిగా ఉధృతమైంది. ప్రచారానికి ఇంకా పదిరోజులే మిగలడంతో అభ్యర్థులు హోరాహోరీగా పర్యటిస్తున్నారు. ఓ వైపు ఎండలు మండుతున్నప్పటికీ సమయం తక్కువగా ఉండడంతో ప్రచారంపైనే దృష్టిసారిస్తున్నారు . ప్రత్యక్షంగా ప్రజలను కలుస్తూ తమను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఎవరికి వారు ధీమాగా ప్రచారాన్ని ఉధృతం చేశారు.

Similar News

News March 10, 2026

భూ హక్కుల కోసమే రీ-సర్వే: అదనపు కలెక్టర్

image

భూములపై పక్కా హక్కులు కల్పించేందుకే రీ-సర్వే చేపడుతున్నట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. మంగళవారం రామాయంపేట మండలం అక్కన్నపేటలో నిర్వహించిన ‘భూభారతి’ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. 100 ఏళ్ల క్రితం నిజాం కాలంలో రూపొందించిన నక్షల్లో ప్రస్తుతం కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని సరిచేయడమే ఈ సర్వే లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.

News March 10, 2026

మెదక్: మహిళ మృతదేహం కలకలం

image

పాపన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. మంగళవారం ఏడుపాయల వెళ్లే రహదారిలోని చెల్మికుంట అడవి ప్రాంతంలో గుర్తుతెలియని మహిళా మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలని ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

News March 10, 2026

సంక్షేమ శాఖ పనితీరు ఆదర్శనీయం: ఐసీడీఎస్ డైరెక్టర్

image

మెదక్ జిల్లాలో మహిళా, శిశు సంక్షేమ శాఖ పనితీరు ఆదర్శంగా ఉందని ఐసీడీఎస్ డైరెక్టర్ శృతి ఓజా ప్రశంసించారు. సోమవారం ఆమె మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రతిమ సింగ్‌తో భేటీ అయ్యారు. అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, జిల్లాలోని కేంద్రాలు, సఖి సెంటర్లలో బాధితులకు, చిన్నారులకు మెరుగైన సేవలు అందుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.