News February 19, 2026

మాతృ, శిశు మరణాల నివారణే లక్ష్యం: డీఎంహెచ్‌ఓ

image

జిల్లాలో హై రిస్క్ గర్భధారణలను ముందుగానే గుర్తించి, మాతృ, నవజాత శిశు మరణాలను తగ్గించడమే ప్రధాన లక్ష్యమని డీఎంహెచ్‌ఓ రామారావు తెలిపారు. గురువారం ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ‘ఇంటిగ్రేటెడ్ హై-రిస్క్ ప్రెగ్నెన్సీ ట్రాకింగ్ అండ్ మేనేజ్‌మెంట్’పై నిర్వహించిన శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. గర్భిణీలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు.

Similar News

News April 20, 2026

KMM: మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లకు మంత్రి తుమ్మల ఆదేశాలు

image

మొక్కజొన్న కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చోట అదనపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ద్వారా 200 కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయని తెలిపారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నను వెంటనే గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని మార్క్‌ఫెడ్ అధికారులను సూచించారు.

అందుబాటులోకి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే

image

జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (ప్యాకేజీ-2) సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. వైరా మండలంలోని సోమవరం ఎగ్జిట్ పాయింట్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు నిర్మించిన ఈ రహదారిని అధికారులు ప్రారంభించారు. నేటి నుంచి టోల్ వసూళ్లు మొదలయ్యాయి. కాగా, ఈ రహదారిపై ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.