News May 2, 2024
చనిపోయింది గోల్డీ బ్రార్ కాదు: US పోలీస్

సిద్ధూ మూసేవాలా హత్య సూత్రధారి, గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ హతమయ్యాడన్న వార్తలను అమెరికా పోలీసులు ఖండించారు. కాలిఫోర్నియాలో నిన్న జరిగిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయిన మాట నిజమేనని, కానీ వారిలో గోల్డీ బ్రార్ లేడని స్పష్టం చేశారు. కాగా గోల్డీ అని అనుకుంటున్న ఆ చనిపోయిన వ్యక్తి జేవియర్ గాల్డ్‌నే (37) అని తెలుస్తోంది. సిద్ధూ మూసేవాలా హత్య సహా మరెన్నో కేసుల్లో బ్రార్ మోస్ట్ వాంటెండ్‌గా ఉన్నాడు.
Similar News
News March 11, 2026
ఇండియాకు వస్తున్న షిప్‌పై ఇరాన్ దాడి!

గుజరాత్‌కు వస్తున్న థాయిలాండ్ కార్గో షిప్ ‘మయూరీ నారీ’పై ఇరాన్ దాడికి దిగింది. UAEలోని ఖలీఫా పోర్టు నుంచి బయల్దేరిన కాసేపటికే హార్ముజ్ జలసంధి వద్ద అటాక్ చేసింది. ఇది తమ పనేనని తాజాగా ధ్రువీకరించింది. అందులోని 20 మంది సిబ్బందిని కాపాడగా, ముగ్గురు మిస్ అయ్యారు. ప్రేషియస్ షిప్పింగ్ కంపెనీకి చెందిన ఈ నౌక కండ్లా పోర్టు(గుజరాత్)కు వస్తోంది.
News March 11, 2026
గ్యాస్ బుక్ చేస్తున్నారా?

TG: గ్యాస్ సిలిండర్ల కొరతను ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. అందుకు నకిలీ LPG బుకింగ్ సైట్లను క్రియేట్ చేస్తున్నారని తెలిపారు. త్వరగా సిలిండర్ సప్లై చేస్తామంటే నమ్మొద్దని, అది మోసమని గ్రహించాలని చెప్పారు. సిలిండర్ బుకింగ్ పేరిట అపరిచిత వ్యక్తులకు OTPలు చెప్పొద్దని సూచించారు. ఈ తరహా మోసాలకు గురైతే 1930కి వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు.
News March 11, 2026
గూగుల్, అమెజాన్‌లపై ఇరాన్ గురి

US ఎంబసీలు, సైనిక స్థావరాలపైన దాడి చేస్తున్న ఇరాన్ ఇప్పుడు టెక్ కంపెనీలపైన ఫోకస్ పెట్టింది. USకు చెందిన క్లౌడ్, డేటా అండ్ డెవలప్మెంట్ సెంటర్లు ఇరాన్ కొత్త టార్గెట్ల జాబితాలో చేరాయని ఆ దేశ మీడియా తస్నిమ్ న్యూస్ తెలిపింది. దీంతో గల్ఫ్ సహా ఇజ్రాయెల్‌లోని అమెరికన్ టెక్ కంపెనీలు అలర్ట్ అయ్యాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, ఐబీఎమ్, ఒరాకిల్, పాలంటీర్ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.


