News May 2, 2024
ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు అలర్ట్

TG: ఇంటర్ పరీక్షలలో ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించేందుకు గడువు నేటితో ముగియనుంది. విద్యార్థులు తమ కాలేజీలోనే ఫీజు చెల్లించాలని అధికారులు సూచించారు. మరోవైపు ప్రిన్సిపల్స్ ఆన్‌లైన్‌లో చెల్లించేందుకు గడువు రేపటి వరకు ఉంది. కాగా ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి.
Similar News
News March 21, 2026
జాగ్రత్త.. రేపు పిడుగులతో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, ఉ.గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పిడుగులతో కూడి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. ప్రజలు చెట్ల కింద నిలబడొద్దని సూచించింది. TGలోని పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు HYD వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ఇచ్చింది.
News March 21, 2026
827 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు

సశస్త్ర సీమా బల్(SSB)లో 827 కానిస్టేబుల్(నాన్ గెజిటెడ్) పోస్టుల భర్తీకి నేటి నుంచి అప్లికేషన్లు ప్రారంభమయ్యాయి. డ్రైవర్, వెటర్నరీ, టైలర్, బార్బర్, వెయిటర్, కార్పెంటర్ తదితర ఉద్యోగాలున్నాయి. టెన్త్ పాస్, సంబంధిత విభాగంలో ITI, డ్రైవర్ పోస్టుకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, వయసు 18-27 ఏళ్లు ఉండాలి. PET/PST, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ APR 21.
సైట్: https://ssb.gov.in/
News March 21, 2026
‘యుద్ధాన్ని మేము ప్రారంభించలేదు’.. మోదీతో ఇరాన్ అధ్యక్షుడు

యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని ప్రధాని మోదీతో ఫోన్ కాల్ సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ స్పష్టం చేశారు. అణుశక్తిపై చర్చలు జరుగుతుండగానే US, ఇజ్రాయెల్ అన్యాయంగా దాడి చేశాయన్నారు. ఇరాన్ అణుకార్యకలాపాలను ఆపేందుకే ఈ దాడులు చేస్తున్నామన్న US వాదనను ఖండించారు. మాజీ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ అణ్వాయుధాలను తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. యుద్ధం ఆగాలంటే ప్రత్యర్థులు వెంటనే దాడులు ఆపాలన్నారు.


