News February 20, 2026
మహబూబ్‌నగర్ స్టేషన్ నుంచి ప్రత్యేక రైలు

హోలీ పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని మహబూబ్‌నగర్ నుంచి రాజ్‌కోట్‌కు ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. రైలు నంబరు 09576 గల ఈ ప్రత్యేక రైలు వచ్చే నెల 3న మహబూబ్‌నగర్‌లో బయలుదేరి జడ్చర్ల, షాద్‌నగర్, ఉందానగర్, కాచిగూడ స్టేషన్ల మీదుగా రాజ్‌కోట్‌కు చేరుకుంటుందని తెలిపారు. పండుగ వేళ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా, అదనపు రద్దీని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
Similar News
News February 22, 2026
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్: SP

తూ.గో జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షల కోసం అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని SP నరసింహ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి చేరుకోవాలని, సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కేంద్రాల చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. నిరంతర నిఘా ఉంటుందని పేర్కొన్నారు.
News February 22, 2026
కుంకుమపువ్వుతో మహిళలకు ఎన్నో లాభాలు

కుంకుమపువ్వుతో మహిళలకు ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. హార్మోన్ల సమతుల్యతను కాపాడటంతో పాటు బీపీ, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడే క్రోసెటిన్, క్రోసిన్ కుంకుమపువ్వులో ఉంటాయంటున్నారు. రోగనిరోధకశక్తిని పెంచడంలో కూడా ఇది తోడ్పడుతుంది. పాలలో కలుపుకొని తాగటం లేదా కుంకుమ పువ్వు టీ చేసుకొని తాగడం మంచిదని సూచిస్తున్నారు.
News February 22, 2026
అనంత: పరీక్షకు ముందే ఇంటర్ ప్రశ్నపత్రాల ఓపెన్

రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రశ్నపత్రాలు ఆయా సెంటర్లకు చేరుకున్నాయి. అయితే ఒక కేంద్రానికి కేటాయించిన బండిళ్లు మరో కేంద్రానికి వచ్చాయి. పరీక్షకు 10 నిమిషాల ముందు తెరవాల్సిన బండిళ్ల (సెట్-3)ను నిన్ననే ఓపెన్ చేయడం చర్చనీయాంశమైంది. ఉరవకొండలోని ఓ కేంద్రానికి సంబంధించిన కవర్లు చెక్ చేయగా 6 కవర్లలో 4 కవర్లు అదే సెంటర్‌కు, మిగిలిన 2 కవర్లు వేరే సెంటర్లకు చెందినవిగా గుర్తించారు.


