News May 2, 2024
చిత్తూరు: కిటకిటలాడుతున్న బ్యాంకులు

సామాజిక పింఛన్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. ఈక్రమంలో నగదును డ్రా చేసుకునేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బ్యాంకులతో పాటు బ్యాంకు సేవా కేంద్రాలు, మినీ ఏటీఎంల వద్ద లబ్ధిదారులు బారులుదీరారు. మరోవైపు దివ్యాంగులు, మంచానికి పరిమితమైన వారికి సచివాలయ ఉద్యోగులు ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.
Similar News
News March 10, 2026
రెస్కో పరిధిలో వన్ టైం సెటిల్మెంట్

కుప్పం రెస్కో పరిధిలో వన్ టైం సెటిల్మెంట్ పథకం అమలు చేస్తున్నట్లు రెస్కో చైర్మన్ ప్రతాప్ తెలిపారు. మార్చి 10 నుంచి 25 వరకు వన్ టైం సెటిల్మెంట్ పథకం అమలు చేయడం జరుగుతుందని, రెస్కో పరిధిలో గృహ వినియోగదారులు 31.01.2026 వరకు పాత బకాయిలు ఉంటే పూర్తిగా వడ్డీ మాఫీ (సర్ చార్జ్) తో బిల్లులు చెల్లించవచ్చన్నారు. రెస్కో పరిధిలోని గృహ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

News March 9, 2026
పాకాల రైల్వే స్టేషన్‌లో రైలు కింద పడి వ్యక్తి దుర్మరణం

పాకాల రైల్వే స్టేషన్‌లో ప్రమాదవశాత్తు ట్రైన్ కిందపడి వ్యక్తి మృతి చెందాడు. పాకాల భారతంమిట్ట ఏడవ క్రాస్ వీధికి చెందిన విశ్వనాథ నాయుడు సోమవారం హైదరాబాద్‌కు వెళ్తుండగా ప్రమాదవశాత్తు రైలు కింద పడి మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.