News May 2, 2024
‘టిల్లూ క్యూబ్’లో పూజా హెగ్డే?

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించనున్న ‘టిల్లూ క్యూబ్’ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే బుట్టబొమ్మను మేకర్స్ సంప్రదించగా ఆమె అంగీకరించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. ఇటీవల విడుదలైన టిల్లు స్క్వేర్ మూవీ సిద్ధు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.125 కోట్లకుపైగా కలెక్షన్లు (గ్రాస్) రాబట్టింది.
Similar News
News January 29, 2026
కుసుమలో ఆకుమచ్చ తెగులు-నివారణకు సూచనలు

ప్రస్తుతం పెరిగిన మంచు తీవ్రత, వాతావరణంలో 70 శాతం కంటే ఎక్కువ తేమ ఉన్నప్పుడు కుసుమ పంటలో ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఆకులపై గోధుమ రంగు గుండ్రటి మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలను గమనిస్తే లీటరు నీటికి 2.5 గ్రాముల మ్యాంకోజెబ్ కలిపి తొలిసారి పిచికారీ చేయాలి. మళ్లీ 7 నుంచి 10 రోజుల వ్యవధిలో రెండోసారి పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
News January 29, 2026
కొలంబోకి టికెట్లు బుక్ చేసుకున్న పాకిస్థాన్!

WC కోసం కొలంబో(SL)కు వెళ్లేందుకు పాకిస్థాన్ టీమ్ టికెట్లు బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పాక్ కొలంబో వెళ్తోందని ‘టెలికమ్ ఆసియా స్పోర్ట్’ పేర్కొంది. తమ రిక్వెస్ట్‌కు ICC నో చెప్పడంతో బంగ్లా WC నుంచి వైదొలిగింది. దానికి మద్దతుగా తాము కూడా బాయ్‌కాట్ చేసే విషయాన్ని ఆలోచిస్తామని పాక్ చెప్పింది. అయితే తమ పార్టిసిపేషన్‌పై సోమవారం PCB ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ తుది నిర్ణయం ప్రకటించే అవకాశముంది.
News January 29, 2026
లిక్కర్ కేసులో ముగ్గురికి బెయిల్

ఏపీ లిక్కర్ కేసులో ముగ్గురు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సజ్జల శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడుకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బెయిలిచ్చింది. రాజ్ కసిరెడ్డి, ముప్పిడి అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్లను కొట్టేసింది.


