News May 2, 2024

మీ ఓటు ఎక్కడుందో తెలియాలంటే..!

image

సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓటు వేయాలి అనుకునేవారు తమ పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి సులభమైన విధానం ఏర్పాటు చేశారు. 1950 నెంబర్‌కు ఫోన్ చేసి ఓటరు పేరు, నియోజకవర్గంలో, ఓటర్ కార్డ్ నెంబరు చెబితే పోలింగ్ బూత్ వివరాలు అందిస్తున్నారు. అదేవిధంగా 0891-2590100‌కు ఫోన్ చేసినా సమాచారం అందిస్తారు. నిత్యం అందుబాటులో ఉండే ఈ కాల్ సెంటర్ సేవలు వినియోగించుకోవచ్చని విశాఖ అధికారులు తెలిపారు.

Similar News

News March 13, 2026

విశాఖ: షాపుల ముందు చెత్త వేస్తున్నారా? రూ.5000 జరిమానా తప్పదు!

image

వార్డుల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. గురువారం 20వ వార్డులో పర్యటించిన ఆయన, రోడ్లపై వ్యర్థాలు వేసిన బ్లింకిట్ అవుట్‌లెట్‌కు రూ.10 వేలు, పాన్ షాపునకు రూ.5 వేల జరిమానా విధించారు. నిబంధనలు ఉల్లంఘించే వాణిజ్య సముదాయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, క్లాప్ వాహనాలు సమయపాలన పాటించాలని ఆయన స్పష్టం చేశారు

News March 13, 2026

విశాఖ పోలీసులను అభినందించిన సీఎం

image

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సైబర్ నేరాలపై విశాఖ పోలీసులు రూపొందించిన 24 షార్ట్ ఫిలింలను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. రాష్ట్రంలో సైబర్ మోసాలతో రూ.వేల కోట్ల నష్టం జరుగుతున్న నేపథ్యంలో అవగాహన పెంచేందుకు వీటిని రూపొందించినట్లు విశాఖ సీపీ బాగ్చీ వివరించారు. ఈ కృషికి పోలీసులను సీఎం అభినందించారు.

News March 12, 2026

మధురవాడ: ఉరివేసుకుని యువకుడు మృతి!

image

మధురవాడ గణేష్ నగర్‌లో తాడి ప్రవీణ్ కుమార్ (27) అనే యువకుడు మనస్థాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చింతపల్లికి చెందిన ప్రవీణ్ గత ఆరేళ్లుగా ఓ మహిళతో సహజీవనం చేస్తూ, స్థానిక టెలిఫోన్ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.