News May 2, 2024
శ్రీశైలం: ఇక నుంచి ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం

పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించామని దేవస్థాన ఈఓ పెద్దిరాజు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. దేవస్థానం చెక్‌పోస్టు వద్ద ప్లాస్టిక్ బాటిళ్లను క్షేత్ర పరిధిలోకి రాకుండా తనిఖీలు చేపడుతామన్నారు. స్థానిక వ్యాపారులు, హోటళ్ల నిర్వాహకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News March 18, 2026
ఈనెల 21న రగ్బీ మహిళల ఛాంపియన్‌షిప్ పోటీలు

ఈనెల 21, 22వ తేదీల్లో కర్నూలు శివారులోని రిడ్జ్ పాఠశాల క్రీడా మైదానంలో ఏపీ స్టేట్ అస్మిత రగ్బీ మహిళల ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు రగ్బీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.రామాంజనేయులు బుధవారం వెల్లడించారు. అండర్-15 సబ్ జూనియర్ విభాగంలో బాలికలకు, సీనియర్ విభాగంలో మహిళలకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజేతలకు కప్పు, మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేస్తామన్నారు.
News March 18, 2026
ఓటర్ల మ్యాపింగ్‌లో పొరపాట్లకు తావివ్వకండి: కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల మ్యాపింగ్‌లో పొరపాట్లకు తావివ్వకుండా చేయాలని కలెక్టర్ డా.ఏ.సిరి డీపీవో భాస్కర్‌ను టెలి కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. బుధవారం ఓటర్ల మ్యాపింగ్, తాగునీటి సమస్య, శానిటేషన్ అంశాలపై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. 484 గ్రామ పంచాయతీలలో ఓటర్లను మ్యాప్ చేసేటప్పుడు కరెక్ట్‌గా చేశారా, లేదా అనేది చూసుకోవాలని పేర్కొన్నారు.
News March 18, 2026
దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: కలెక్టర్

దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ ఏ.సిరి అన్నారు. గురువారం కర్నూలు బస్టాండ్‌లో ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మతో కలిసి ఆమె ప్రారంభించారు. దివ్యాంగులతో కలిసి కలెక్టర్ బస్సు ప్రయాణం చేశారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పెద్ద ఎత్తున సంక్షేమానికి సీఎం చంద్రబాబు 70 ఏళ్ల వయసులోనూ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.


