News May 2, 2024

ఇది భాగ్యలక్ష్మి అమ్మవారి భాగ్యనగరం: BJP

image

‘ఇది భాగ్యలక్ష్మి అమ్మవారి భాగ్యనగరం’ అంటూ @BJP4Telangana ట్వీట్‌ చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం రాత్రి HYD MP అభ్యర్థి మాధవీ లతకు మద్దతుగా లాల్‌దర్వాజా BJP బహిరంగ సభలో ‌పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో‌లను షేర్ చేసిన బీజేపీ తెలంగాణ తన అధికారిక సోషల్ మీడియా ‘X’లో‌ ‘Hyderabad ❌ Bhagyanagar ✅’ అని రాసుకొచ్చింది. దీనిపై మీ కామెంట్?

Similar News

News January 17, 2025

నేడు గుడిమల్కాపూర్‌ మర్కెట్ కమిటీ ప్రమాణం

image

గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఈరోజు జరుగనుంది. ఛైర్మన్‌గా మల్లేశ్, వైస్ ఛైర్మన్ చంద్రశేఖర్ సభ్యులు ప్రమాణం చేయనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, తుమ్మల నాగేశ్వర్‌రావు తదితరులు హాజరుకానున్నారు.

News January 17, 2025

HYD: చిన్నప్పటి నుంచి నుమాయిష్‌కు వచ్చేవాడిని: సీపీ

image

నుమాయిష్ ద్వారా వచ్చే ఆదాయంతో విద్యారంగ వ్యాప్తికి నిర్వాహకులు ఎంతో కృషి చేస్తున్నారని HYD సీపీ సీవీ ఆనంద్ అన్నారు. గురువారం ఇందులో పోలీస్ స్టాల్‌ను ప్రారంభించి మాట్లాడారు. తన చిన్నప్పటి నుంచి నుమాయిష్‌ను సందర్శించి కావాల్సినవి కొనుక్కుని ఉల్లాసంగా గడిపేవాడినని గుర్తుచేసుకున్నారు. ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్, డీసీపీలు,ఏసీపీలు,ఇన్ స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

News January 17, 2025

HYD: బ్రిజేష్ ట్రిబ్యునల్‌ను ప్రభుత్వం స్వాగతిస్తోంది: మంత్రి

image

బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ నిర్ణయంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌ను తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తోందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. తెలంగాణకు సరైన న్యాయం జరిగేందుకు ఈ తీర్పు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. బచావత్ ట్రైబ్యునల్ ఎన్.బ్లాక్‌గా కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కనుందని తెలిపారు.