News May 2, 2024

చిత్తూరు: కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

మద్యం రవాణా, అక్రమ విక్రయాలను అడ్డుకుని ఎక్సైజ్ కేసులు తగ్గించడానికి ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని జిల్లా మద్య నిషేధ, అబ్కారీ శాఖ అధికారిణి షేక్ ఆయేషా బేగం తెలిపారు. సీఐ సుధాకర్ 95736 32427, కానిస్టేబుల్ కుమార్ జాన్సన్ 89191 60437, జూనియర్ సహాయకులు శ్రీనివాస యాదవ్ 93986 74616లు అందుబాటులో ఉంటారన్నారు. ఎక్సైజ్ నేరాలకు సంబంధించి ఈ నెంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News October 19, 2025

‘కాంతార’లో మెప్పించిన SRపురం వాసి

image

పాన్ ఇండియా మూవీ ‘కాంతార’లో SRపురం(M) పొదలపల్లికి చెందిన ఏకాంబరం నటించారు. ఇందులో భాగంగా తన నటనకు దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి మొచ్చకున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన్ను స్వగ్రామం గంగాధర నెల్లూరులో వైసీపీ నేత కృపాలక్ష్మి అభినందించారు. సినిమా రంగంలో మరింత ప్రతిభ చూపి గుర్తించ దగ్గ పాత్రలు పోషించాలని ఆమె ఆకాంక్షించారు.

News October 19, 2025

పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు ప్రారంభం

image

పదో తరగతి విద్యార్థులు ఈనెల 21 నుంచి పరీక్ష ఫీజులు చెల్లించేందుకు రాష్ట్ర విద్యాశాఖ అనుమతించింది. ఈ మేరకు చిత్తూరు డీఈఓ వరలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర పరీక్షల విభాగం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు పరీక్ష ఫీజు చెల్లించాలి. పరీక్ష చెల్లించే సమయంలో విద్యార్థులకు తప్పనిసరిగా అపార్ ఐడీ ఉండాలి. ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని హెచ్ఎంలను డీఈఓ ఆదేశించారు.

News October 19, 2025

నేడు చిత్తూరులో ముగింపు సమావేశం

image

జీఎస్టీ తగ్గింపు వల్ల వివిధ రకాల వస్తువుల ధరల తగ్గుదలపై నెలరోజులుగా జిల్లాలో వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించారు. నేడు జీఎస్టీ 2.0 ముగింపు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. చిత్తూరులోని మహాత్మ జ్యోతిరావు ఫూలే భవన్‌లో ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరుకానున్నారు.