News May 2, 2024
ఏయూలో లాజిస్టిక్స్ సప్లై చైన్ మేనెజ్మెంట్ కోర్సుకు దరఖాస్తులు

ఆంధ్ర యూనివర్సిటీ 2024-25 విద్యాసంవత్సరానికి లాజిస్టిక్స్ ఎంబీఏ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఆంధ్ర యూనివర్సిటీ, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లాజిస్టిక్స్ కౌన్సిల్‌తో కలిపి ఈ కోర్సులను ఆన్‌లైన్ ద్వారా అందిస్తోంది. లాజిస్టిక్స్ సప్లై చైన్ మేనెజ్మెంట్‌లో రెండేళ్ల కోర్సును అందిస్తోంది. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. జూన్ 18 చివర తేదీ.
Similar News
News March 11, 2026
పాలకవర్గ గడువు ముగియకముందే స్టాండింగ్ కమిటీ సమావేశం

జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని ఈనెల 13న నిర్వహించనున్నారు. మేయర్ పీలా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు అజెండా సిద్ధం చేసి సభ్యులకు సమాచారం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈనెల 17తో పాలకవర్గం పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఇదే చివరి సమావేశం. గతంలో పెండింగ్‌లో ఉన్న కొన్ని అంశాలు, బిల్లుల చెల్లింపులకు సంబంధించిన ప్రతిపాదనలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
News March 11, 2026
విశాఖ నీటి భద్రతకు వ్యూహాత్మక ప్రణాళిక

అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖకు భవిష్యత్ నీటి భద్రత కోసం సమగ్ర వ్యూహాత్మక ప్రణాళిక అవసరమని VER సీఈవో యువరాజ్ అన్నారు. GVMC ఆధ్వర్యంలో నోవోటెల్‌లో జరిగిన ‘క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ ఫర్ వాటర్ సెక్టార్’ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. పెరుగుతున్న జనాభా, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నీటి వనరులను సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ సూచించారు.
News March 11, 2026
విశాఖ: ఎన్నికలపై సందిగ్ధత

విశాఖలో భీమిలి నియోజకవర్గ పరిధిలోని సుమారు 64 గ్రామ పంచాయతీలను జీవీఎంసీలో విలీనం చేసే ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒకవేళ ఈ ప్రక్రియ ప్రారంభమైతే వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితాల సవరణ, పరిపాలనా పునర్వ్యవస్థీకరణ వంటి పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఇవి పూర్తయ్యే వరకు ఎన్నికలు వాయిదా పడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అనిశ్చితి నెలకొంది.


