News February 20, 2026
ఇంటి చిట్కాలు

* కొవ్వొత్తులను వెలిగించే ముందు వాటి పైభాగాన కాస్త ఉప్పు రాస్తే ఎక్కువ సమయం వెలుగుతాయి.
* చెత్తబుట్టలో బ్యాక్టీరియా చేరి దుర్వాసన రాకుండా ఉండాలంటే.. బుట్ట అడుగు భాగంలో కొంచెం బొరాక్స్ పొడి చల్లాలి.
* కాస్త వెనిగర్‌లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి డైనింగ్ టేబుల్ తుడిస్తే ఎలాంటి మరకలైనా పోతాయి.
* ట్యాపులపై ఉండే మచ్చలు పోయి కొత్తవాటిలా మెరవాలంటే వారానికోసారి నిమ్మకాయ ముక్కతో రుద్దాలి.
Similar News
News February 20, 2026
సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News February 20, 2026
గొర్రెల్లో నీలి నాలుక వ్యాధి కట్టడికి సూచనలు

గొర్రెలకు నీలి నాలుక వ్యాధి సోకకుండా ఉండాలంటే వైరస్ వ్యాప్తికి కారణమయ్యే దోమలను కట్టడి చేయాలి. దీని కోసం ప్రతి రోజూ ఎండిన వేపాకులతో పొగ పెట్టాలి. వ్యాధి సోకిన గొర్రెలను మంద నుంచి వేరుచేస్తే మిగతా వాటికి వ్యాధి వ్యాపించదు. గొర్రెల షెడ్‌ను పొడిగా ఉంచాలి. వ్యాధి సోకిన గొర్రెలను వెటర్నరీ డాక్టరుకు చూపించి అవసరమైన మందులు వాడాలి. వ్యాధి కట్టడికి ప్రభుత్వం అందించే టీకాలను గొర్రెలకు వేయించాలి.
News February 20, 2026
అల్లు అర్జున్ ‘సంధ్య థియేటర్ తొక్కిసలాట’ కేసు.. UPDATE

TG: అల్లు అర్జున్ ‘పుష్ప-2’ రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను మూడోసారి నాంపల్లి కోర్టు తిప్పి పంపింది. అందులో లోపాలు ఉన్నాయని, హార్డ్ డిస్క్‌లు, CDలు, పెన్‌డ్రైవ్‌లు జత చేయలేదని పేర్కొంది. కాగా తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా, కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో 23 మందిపై కేసు నమోదైంది.


