News May 2, 2024

ఒక్క నెలలోనే 21 వేల పింక్ స్లిప్స్

image

ప్రపంచవ్యాప్తంగా IT రంగంలో ఉద్యోగాల కోతలు ఆగడం లేదు. ఈ ఏప్రిల్‌లో ఏకంగా 21వేల మంది ఇంటిబాటపట్టారు. టెస్లా (14K), టర్కీ డెలివరీ కంపెనీ జెటిర్ (6K), యాపిల్ (600) కంపెనీలు ఎక్కువ మందిని తొలగించాయి. 2024 తొలి 4 నెలల్లో 271 కంపెనీలు 78K మందికి పింక్ స్లిప్స్ ఇచ్చాయి. కోవిడ్ ముందు, ఆ సమయంలో జరిగిన ఓవర్ హైరింగ్, AIపై పెట్టుబడులు, కొత్త ప్రాజెక్టుల కొరత వంటివి దీనికి ప్రధాన కారణాలనేది నిపుణుల అభిప్రాయం.

Similar News

News December 25, 2024

ప్రజలను వణికిస్తోన్న చలి పులి

image

రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. రానున్న రెండు రోజుల్లో దీని తీవ్రత మరింత పెరిగే అవకాశముందని ఐఎండీ తెలిపింది. TGలోని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 5.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే హైదరాబాద్‌లో 11.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అటు APలోనూ సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

News December 25, 2024

రేపు సెలవు

image

తెలంగాణలో రేపు కూడా స్కూళ్లకు సెలవు ఉండనుంది. క్రిస్మస్ సందర్భంగా ఈరోజు, రేపు ప్రభుత్వం పబ్లిక్ హాలిడే ప్రకటించింది. అటు ఏపీ ప్రభుత్వం ఇవాళ ఒక్కరోజే పబ్లిక్ హాలిడే ఇవ్వగా, రేపు ఆప్షనల్ హాలిడే అని తెలిపింది. అంటే అక్కడి పరిస్థితులను బట్టి జిల్లా విద్యాధికారులు సెలవు ఇవ్వడంపై నిర్ణయం తీసుకుంటారు. ఈమేరకు సెలవు ఉండేది, లేనిది ఇప్పటికే విద్యార్థులకు సమాచారం అందించారు.

News December 25, 2024

IND vs AUS : రేపే బాక్సింగ్ డే టెస్ట్

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపటి నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. మెల్‌బోర్న్‌లో ఉదయం 5 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్ చూడొచ్చు. ఈ టెస్టులో విజయం సాధించి సిరీస్‌లో ముందుకెళ్లాలని ఇరు జట్లూ భావిస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ ఓపెనింగ్ వస్తారని తెలుస్తోంది. నితీశ్‌ను పక్కనబెడతారని టాక్.