News May 2, 2024
‘కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నాడు’

కేసీఆర్ మాటల గారడీతో ప్రజలను మోసం చేశాడని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి మాట్లాడారు. కేసీఆర్ తన పాలనలో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దోచుకున్నాడని, ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడంతోనే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని అన్నారు. రఘురాంరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.
Similar News
News March 15, 2026
BREAKING: ఖమ్మం: విద్యుత్ షాక్‌తో పంచాయతీ సెక్రటరీ మృతి

కరెంటు షాక్ తగిలి పంచాయతీ కార్యదర్శి మృతి చెందిన విషాద ఘటన ఉదయం కారేపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఏన్కూరు మండలం తిమ్మారావుపేట కార్యదర్శిగా పనిచేస్తున్న సురేష్ కారేపల్లిలోని తన నివాసంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆయన స్వగ్రామంతో పాటు విధులు నిర్వర్తిస్తున్న గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
News March 15, 2026
ఖమ్మం: యుద్ధ మేఘాలు.. వంట గదిలో మంట

అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులు సామాన్యుడి వంట గదిపై పెనుభారం మోపుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, దిగుమతులు తగ్గడంతో వంట నూనెల ధరలకు రెక్కలు వచ్చాయి. నెల క్రితం రూ.155 ఉన్న సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ. 180కు, రూ. 110 ఉన్న పామాయిల్ రూ.135కు చేరింది. వేరుశనగ, కొబ్బరి నూనెల ధరలు కూడా భారీగా పెరగడంతో మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నిత్యావసరాల ధరల పెరుగుదలపై జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News March 15, 2026
ఖమ్మం: పరీక్షల్లో నిర్లక్ష్యం.. సిబ్బందిపై వేటు

పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. DEO చైతన్య జైని కొణిజర్ల జడ్పీహెచ్‌ఎస్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. గేట్లు తెరిచి ఉంచడం, అపరిచితులను అనుమతించడం గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారి, ఇన్విజిలేటర్‌ను విధుల నుంచి తొలగించి వారి స్థానంలో ఇతరులను నియమించారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు.


