News February 20, 2026
నెల్లూరు: 5రోజుల్లోనే రైతులకు డబ్బుల జమ

నెల్లూరు జిల్లాలో శనగ పంటను క్వింటాల్‌కు ₹5,875 మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. రైతులు ఫిబ్రవరి 20 నుంచి మార్చి 2వ తేదీ లోపు తమ గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. తేమ శాతం 14% లోపు ఉన్న పంటను మాత్రమే సేకరిస్తామని, విక్రయించిన 5 రోజుల్లోనే నగదు జమ అవుతుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 8978381839 నంబర్‌ను సంప్రదించవచ్చని సూచించారు.
Similar News
News February 21, 2026
ఇంటర్ పరీక్షలకు పటిష్ట బందోబస్త్: నెల్లూరు SP

ఇంటర్ పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు SP అజిత తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రం సమీపంలో ఉండే జిరాక్స్ సెంటర్లను మూసివేస్తున్నట్లు వివరించారు. మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ వంటి చర్యలకు విద్యార్థులు ఎవరైనా పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 23 నుంచి మార్చి 24 వరకు పరీక్షలు జరగనున్నాయి.
News February 21, 2026
బుచ్చిలో రూ.కోట్లలో క్రికెట్ బెట్టింగ్..?

బుచ్చి క్రికెట్ బెట్టింగ్‌కు అడ్డాగా మారింది. నిత్యం కోట్లలో బెట్టింగ్ సాగుతుంది. నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు వద్ద పట్టుబడ్డ నగదే ఇందుకు సాక్ష్యం. రాదే ఎక్స్‌ఛేంజ్ యాప్ తరహాలో ఎన్నో యాప్‌ల ద్వారా యువతే లక్ష్యంగా నిత్యం బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. యువత బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టుకొని ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా ఎస్పీ దృష్టి పెడితే ఎందరో బెట్టింగ్ రాయుళ్లు వెలుగులోకి వచ్చే అవకాశం.
News February 21, 2026
సోషల్ మీడియా ద్వారా సమస్యలు చెబుతున్న చిన్నారులు

సోషల్ మీడియాతో విద్యార్థులు పెడదారిన పడుతున్న సమయంలో అదే వేదికగా తమ సమస్యలు పాలకుల దృష్టికి తీసుకు వెళ్తున్న సందర్భాలు జరుగుతున్నాయి. ఇటీవల కొండాపురం (M) గజ్జలవారిపల్లి గ్రామానికి విద్యార్థులు రోడ్డు లేదని సోషల్ మీడియా ద్వారా తెలియజేయడంతో పవన్ కళ్యాణ్ స్పందించారు. అదే పందాను అనుసరిస్తూ విద్యార్థులు తమకు రోడ్లు లేవని చేతులెత్తి ముక్కుతూ వీడియో విడుదల చేయడం కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తుంది.


