News February 20, 2026
అమీర్‌పేటలో ప్రాణాలు కాపాడింది వీళ్లే!

మైత్రివనంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదాన్ని హైడ్రా డీఆర్‌ఎఫ్ సిబ్బంది సమర్థంగా అదుపులోకి తీసుకొచ్చింది. రెండో అంతస్తులో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. హైడ్రా కమిషనర్, అదనపు డైరెక్టర్, ఏడీఎఫ్‌వో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సిబ్బంది చూపిన ధైర్యసాహసాలను అభినందించారు. ప్రాణాలు కాపాడిన సిబ్బందికి సెల్యూట్.
Similar News
News February 25, 2026
HYD: FSL హాల్ టికెట్లపై కీలక అప్డేట్.. రేపట్నుంచే

TG ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ(FSL) రాత పరీక్షల హాల్ టికెట్లకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. రేపు ఉదయం 8 గంటల నుంచి వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని TSLPRB ఛైర్మన్ VV శ్రీనివాసరావు తెలిపారు. మార్చి 5, 6, 7 తేదీల్లో మేడ్చల్ పీటీసీలో ఈ పరీక్షలు జరగనున్నాయన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్‌పై ఫొటో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
News February 25, 2026
HYD: Weekendలో బెస్ట్ టూర్ ఇదే!

నిత్యం ఉరుకుల పరుగుల నగర జీవితంతో అలసిపోయిన వారికి ఈ వీకెండ్‌లో మనశ్శాంతిని పంచే అద్భుత టూర్ ఒకటుంది. నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం మానసిక ప్రశాంతతకు నిలయంగా విరాజిల్లుతోంది. HYD నుంచి జస్ట్ 150KM మాత్రమే. అంతర్జాతీయ బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్, ఆధ్యాత్మికత, ప్రకృతి అందాలను ఒకే చోట చూడొచ్చు. నాగార్జునసాగర్, వాటర్ ఫాల్స్, నాగార్జునకొండ మ్యూజియం కూడా ఉంది. రెండ్రోజులు చిల్ అవ్వొచ్చు. ప్లాన్ చేసుకోండి.
News February 25, 2026
సైబరాబాద్ కమిషనరేట్‌కు కొత్తగా 2 పోలీస్ కేనైన్‌లు

తెలంగాణ సీఐడీ నుంచి రెండు పోలీస్ కేనైన్‌లు సైబరాబాద్ కమిషనరేట్‌కు బదిలీ అయ్యాయి. దీంతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న జాగిలాల సంఖ్య18కు చేరింది. పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాల గుర్తింపు, ట్రాకింగ్ వంటి కీలక విధుల్లో ఇవి సేవలందించనున్నాయి. సీఐడీ నుంచి వచ్చిన ‘రానా’ (బెల్జియన్ మాలినోయిస్), ‘రాడో’ (లాబ్రడార్) నేరాల ఛేదనలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు.


