News May 2, 2024

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సంచలన నిర్ణయం

image

ఢిల్లీ మహిళా కమిషన్‌కు చెందిన 223 మంది ఉద్యోగులను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తొలగించారు. ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ కమిషన్ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు వీరిని నియమించినట్లు తెలుస్తోంది. ‘ప్యానెల్‌‌కు సరిపడా 40 మంది ఉద్యోగులు ఉన్నా లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేకుండా 223 పోస్టులు సృష్టించారు. వీరిని నియమించే అధికారం కమిషన్‌కు లేదు’ అని ఆర్డర్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం పేర్కొంది.

Similar News

News March 14, 2026

పరవాడ: ఎన్టీపీసీ 2వ యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణ

image

పరవాడ సింహాద్రి ఎన్టీపీసీ 2వ యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తిని శుక్రవారం పునరుద్ధరించారు. 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్‌లో సాంకేతిక లోపం కారణంగా ఈనెల 11న విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించారు. ప్రస్తుతం నాలుగు యూనిట్లలో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని అధికారులు తెలిపారు.

News March 14, 2026

6 నెలల్లో స్థానిక ఎన్నికలు: CM

image

AP: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు అప్‌డేట్ ఇచ్చారు. ఎన్నికలు ఆరు నెలల్లో జరిగే అవకాశం ఉందని, వాటికి ఇప్పటి నుంచే సిద్ధం కావాలని మంత్రులకు సూచించారు. నిన్న క్యాబినెట్ భేటీలో అజెండా అంశాలపై చర్చ అనంతరం తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో మనమే గెలిచామని, ఈసారీ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించేలా ఇన్‌ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు.

News March 14, 2026

నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్

image

తెలంగాణలో నేటి నుంచి ఏప్రిల్ 13 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. 9.30AM-12.30PM వరకు 3 గంటల పాటు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. గంట ముందే సెంటర్‌కు చేరుకోవాలని, ఎగ్జామ్ ప్రారంభమైన 5 ని. తర్వాత కూడా అంటే 9.35AM వరకు లోపలికి అనుమతిస్తామని ప్రభుత్వం తెలిపింది. మొత్తం 5,28,239 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచులు, కాలిక్యులేటర్లకు పర్మిషన్ లేదు.
All The Best