News February 20, 2026

గురుకుల ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: నిర్మల్ డీఈవో

image

నిర్మల్ జిల్లాలో ఈనెల 22న ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే గురుకుల ప్రవేశ పరీక్ష అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈవో భోజన్న తెలిపారు. ఐదో తరగతిలో ప్రవేశం కోసం జిల్లా వ్యాప్తంగా 6984 పంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Similar News

News February 28, 2026

సెకండ్ ఇయర్ ఇంగ్లిష్ ఎగ్జామ్‌కు 365 మంది గైర్హాజరు

image

ఇంటర్ పరీక్షల్లో భాగంగా శనివారం సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లిష్ పరీక్ష నిర్వహించారు. 18,465 మంది విద్యార్థులకు గాను 18,098 మంది విద్యార్థులు హాజరయ్యారు. 367 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటుచేసుకోలేదని వెల్లడించారు. పరీక్షలు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

News February 28, 2026

విజయనగరం జిల్లాను ఉద్యాన వనంగా తీర్చి దిద్దుతాం: సీఎం

image

విజయనగరం జిల్లాలో వచ్చే రెండేళ్లలో పండ్ల తోటల పెంపకానికి తగిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. మరో రెండేళ్లలో ఇది కార్యరూపం దాలుస్తుందన్నారు. ప్రస్తుతం సాగు చేస్తున్న మొక్కజొన్న వల్ల పెద్దగా ప్రయోజనం లేదన్నారు. ఇకపై భవిష్యత్తులో పండ్లతోటలకు ప్రాధాన్యత ఇవ్వాలని రైతులకు సూచించారు. దీనికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందన్నారు.

News February 28, 2026

మహబూబ్‌నగర్‌: వచ్చే నెల 4న హోలీ పండుగ

image

మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు హోలీ పండుగను మార్చి 4వ తేదీన నిర్వహించాలని జిల్లా బ్రాహ్మణ సంఘం తెలిపింది. జ్యోతిష్య పండితులచే చర్చించిన అనంతరం 2వ తేదీన కామ దహన కార్యక్రమం నిర్వహించాలని, 3న చంద్రగ్రహణం ఉన్నందున4వ తేదీన హోలీ వేడుకలు నిర్వహించుకోవాలని జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు గోండ్యాల రాఘవేంద్ర శర్మ తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు బుధవారం ఉత్సవాలు చేసుకోవాలని సూచించారు.