News February 20, 2026

ట్రోలిన్ పేలి.. గట్టుసింగారం వాసి మృతి

image

యాదాద్రి (D) భూదాన్ పోచంపల్లి ధోతిగూడెం శివారులోని ఓ కంపెనీలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో కూసుమంచి గట్టుసింగారానికి చెందిన ధార పవన్ మృతి చెందారు. భోజన విరామ సమయంలో కార్మికులంతా బయటకు వెళ్లగా, విధుల్లో ఉన్న పవన్ వద్ద ట్రోలిన్ పేలింది. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడు సీనియర్ కెమిస్ట్రీ కార్మికుడిగా పనిచేస్తున్నారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News February 25, 2026

ఖమ్మం: టెన్త్ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు: అదనపు కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ శ్రీజ ఆదేశించారు. మంగళవారం డీఈఓ చైతన్య జైనీతో కలిసి ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, వెలుతురు వంటి కనీస వసతులు కల్పించాలని సూచించారు. నిరంతర పర్యవేక్షణ ఉండాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News February 25, 2026

ఖమ్మం: సైబర్ ట్రాఫికింగ్‌పై అప్రమత్తత అవసరం

image

మహిళలు, యువతులే లక్ష్యంగా సాగుతున్న సైబర్ ట్రాఫికింగ్‌పై అంగన్‌వాడీ టీచర్లు సమాజంలో అవగాహన కల్పించాలని ఖమ్మం జిల్లా సంక్షేమ అధికారి విజేత పిలుపునిచ్చారు. ‘ప్రజ్వల’ సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రేమ, ఉద్యోగాల పేరుతో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బాధితులకు అండగా నిలవాలని ఆమె సూచించారు.

News February 25, 2026

వెలుగుమట్ల భూదాన్ భూములు స్వాధీనం: అదనపు కలెక్టర్

image

ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నట్లు అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు. భూదాన్ యజ్ఞ బోర్డు ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలను తొలగించామన్నారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మినహాయించిన నిర్మాణాలు మినహా, మిగిలిన 308 మంది ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. బాధితుల సామాగ్రిని అంబేద్కర్ భవనంలో భద్రపరిచామని ఆయన వెల్లడించారు.