News May 2, 2024
బుగ్గారం: బీఆర్ఎస్కు రాజీనామా ఎంపీపీ, జడ్పీటీసీ
బుగ్గారం మండల MPP, ZPTC బాదినేని రాజమణి, రాజేందర్ గురువారం BRSకు రాజీనామా చేశారు. ధర్మపురి నియోజకవర్గంలో కీలకనేతగా గుర్తింపు పొందిన రాజేందర్ రాజీనామా చేయడంతో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీ పిలుపు మేరకు అన్నికార్యక్రమాలు చేపట్టిన కూడా తమను అణచివేతకు గురిచేసి, చిన్నచూపు చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రాజీనామా చేసినట్టు వివరించారు.
Similar News
News January 13, 2025
జనవరి 26 నుంచి రైతు భరోసా పథకం ప్రారంభం: పెద్దపల్లి ఎమ్మెల్యే
ఈనెల 26 నుంచి రైతు భరోసా పథకం ప్రారంభమవుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు తెలిపారు. భరోసా, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, తదితర ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
News January 13, 2025
కోనరావుపేట: చిన్నారిపై వృద్ధుడి లైంగిక దాడి
కోనరావుపేట మండలం ఓ గ్రామానికి చెందిన ఓ చిన్నారిపై అదే గ్రామానికి చెందిన వృద్ధుడు లైగింక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్న మహిళ భర్త ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపారు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
News January 13, 2025
నేటి నుంచి SU పరిధిలోని కళాశాలలకు సెలవులు
సంక్రాంతి పండగ నేపథ్యంలో.. కరీంనగర్ పట్టణంలోని శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలకు సెలవులు ప్రకటించారు. యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ, బీఈడీ, ఫార్మసీ, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు నేటి నుంచి ఈ నెల 15 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించినట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తిరిగి 16 నుంచి తరగతులకు హాజరు కావాలన్నారు.