News May 2, 2024

రూ.2వేల కోట్ల నగదు పట్టివేత

image

AP: అనంతపురం జిల్లా పామిడి వద్ద నాలుగు కంటైనర్లలో తరలిస్తున్న కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. ఒక్కో కంటైనర్‌లో రూ.500 కోట్లు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. మొత్తం రూ.2 వేల కోట్లను కొచ్చి నుంచి హైదరాబాద్ ఆర్బీఐకి తీసుకెళ్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కరెన్సీ తరలింపు రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Similar News

News March 11, 2026

నేడు కేరళ, తమిళనాడుకు ప్రధాని మోదీ

image

ప్రధాని మోదీ ఇవాళ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఉదయం కేరళలోని కొచ్చిలో ₹10,800కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం TNలోని తిరుచిరాపల్లిలో ₹5,650కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఈ పర్యటనకు ముందే మధురై ఎయిర్‌పోర్టుకు కేంద్రం అంతర్జాతీయ హోదాను ప్రకటించింది. ఈ విజిట్‌తో మోదీ ఇరు రాష్ట్రాల్లో అధికారికంగా NDA ఎన్నికల ఢంకా మోగించనున్నట్లు తెలుస్తోంది.

News March 11, 2026

ఈరోజు నమాజ్ వేళలు (11-3-2026) బుధవారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.16 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.27 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.49 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.26 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.38 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 11, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.