News May 2, 2024
ATMలో కొత్త మోసం!

ATMలో కొత్త తరహా మోసానికి పాల్పడుతున్న ముఠాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్యూరిటీ లేని ATMలో CC కెమెరాలకు స్ప్రే చల్లి మెషిన్‌లోని కార్డు రీడర్ తొలగిస్తారు. కస్టమర్ కార్డు పెట్టగానే ఇరుక్కుపోతుంది. పిన్ ఎంటర్ చేస్తే కార్డు బయటకు వస్తుందని నమ్మిస్తారు. కానీ కార్డు రాకపోవటంతో బ్యాంకుకు వెళ్లాలని సూచిస్తారు. కస్టమర్ వెళ్లిపోగానే కేటుగాళ్లు పిన్ ఎంటర్ చేసి డబ్బులు డ్రా చేసేస్తారు.
Similar News
News March 18, 2026
గ్రూప్-2లో పోస్టుల సంఖ్యను పెంచాలి: చిరంజీవి

AP: గ్రూప్-2 నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్య పెంచాలని MLC వేపాడ చిరంజీవి సీఎస్ సాయిప్రసాద్‌ను కోరారు. నిరుద్యోగుల సమస్యలపై CSకు వినతిపత్రం సమర్పించారు. గ్రూప్-2లో డిప్యూటీ తహశీల్దార్ పోస్టులు చేర్చాలని, జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్యను పెంచాలని కోరారు. అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా జాబ్ క్యాలెండర్‌లో దాదాపు 600 గ్రూప్-1, 2 పోస్టులు ఉంటాయని సమాచారం.
News March 18, 2026
ఈ గ్రామంలో ఉన్నట్టుండి నిద్రపోతారు!

కజకిస్థాన్‌లోని కలాచి అనే గ్రామంలో ప్రజలు ఎప్పుడు, ఎలా నిద్రపోతారో ఎవరికీ తెలియదు. నడుస్తున్నా, మాట్లాడుతున్నా సరే ఒక్కసారిగా గాఢ నిద్రలోకి జారుకుంటారు. ఎవరూ లేపకపోతే రోజుల తరబడి పడుకుండిపోతారు. అందుకే దీనిని ‘స్లీపీ హలో’ అని పిలుస్తారు. సమీపంలోని పాత యురేనియం గనుల నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ వల్ల ఈ వ్యాధి వచ్చిందని భావిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో
News March 18, 2026
మరికొన్ని గంటల్లో విధ్వంసం.. ఇరాన్ హెచ్చరిక

మరికొన్ని గంటల్లో గల్ఫ్ దేశాల్లోని పెట్రోకెమికల్ ఫెసిలిటీస్‌పై దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. సౌదీలోని జుబైల్, సమ్రెఫ్, ఖతర్‌లోని మిసాయిద్, రస్ లఫాన్ రిఫైనరీ, యూఏఈలోని అల్-హసన్ గ్యాస్ ఫెసిలిటీలపై అటాక్ చేస్తామని శాటిలైట్ ఫొటోలను రిలీజ్ చేసింది. ఈ 3 దేశాల్లోని ఆయా ఫ్యాక్టరీల్లో పని చేసే కార్మికులు, ప్రజలు అక్కడి నుంచి వెంటనే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది.


