News February 21, 2026
ఆదిలాబాద్ జిల్లాలో 13 పరీక్ష కేంద్రాలు: డీసీవో

గురుకులాల్లో ఐదవ తరగతి ఉమ్మడి పరీక్ష, 6, 7, 8, 9 తరగతులలో మిగిలిన సీట్లకు ప్రవేశ పరీక్షను ఈనెల 22న నిర్వహిస్తున్నట్లు డీసీఓ లలిత కుమారి పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 13 పరీక్ష కేంద్రాలు ఉన్నాయనీ.. మొత్తం 4820 మంది బాలబాలికలు హాజరవుతున్నారని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 10 గంటల్లోపు చేరుకోవాలని సూచించారు.
Similar News
News February 21, 2026
ఇంటర్ పరీక్షలకు డ్రోన్‌తో నిఘా: SP

ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా అన్ని కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP జి. బిందు మాధవ్ శనివారం తెలిపారు. ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే పరీక్షల్లో డ్రోన్, సోలార్ కెమెరాలతో నిఘా ఉంటుందన్నారు. DHMD, HHMDలతో తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసి విజయం సాధించాలని ఆకాంక్షించారు. పరీక్ష కేంద్రాలకు ప్రతి ఒక్కరూ సమయానికి చేరుకోవాలని సూచించారు.
News February 21, 2026
ఆ కామెంట్స్ తర్వాత 3 రోజులు నిద్రపట్టలేదు: శివాజీ

హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై తాను చేసిన వివాదాస్పద <<18692465>>వ్యాఖ్యలపై<<>> నటుడు శివాజీ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఏ మహిళనూ తక్కువ చేయాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ‘నేను పబ్లిక్‌లో ఎప్పుడూ నోరు జారలేదు. ఆ రోజు 2 పదాలు ఎందుకు తప్పుగా మాట్లాడానో అర్థం కాలేదు. ఆ కామెంట్స్ తర్వాత 3 రోజులు నిద్ర పట్టలేదు. ఎంతో మానసిక సంఘర్షణకు గురయ్యా. కానీ నా ఉద్దేశం ఏంటో ప్రజలు అర్థం చేసుకున్నారు’ అని తెలిపారు.
News February 21, 2026
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టవిరుద్ధమని ఆర్డీవో కేశవ నాయుడు హెచ్చరించారు. డివిజనల్ స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తామని తెలిపారు. నిబంధనలు అతిక్రమించే స్కానింగ్ కేంద్రాల అనుమతులు రద్దు చేయడంతో పాటు, జరిమానాలు, క్రిమినల్ చర్యలు తప్పవన్నారు. లింగ వివక్ష నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.


