News February 21, 2026

ఆదిలాబాద్ జిల్లాలో 13 పరీక్ష కేంద్రాలు: డీసీవో

image

గురుకులాల్లో ఐదవ తరగతి ఉమ్మడి పరీక్ష, 6, 7, 8, 9 తరగతులలో మిగిలిన సీట్లకు ప్రవేశ పరీక్షను ఈనెల 22న నిర్వహిస్తున్నట్లు డీసీఓ లలిత కుమారి పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 13 పరీక్ష కేంద్రాలు ఉన్నాయనీ.. మొత్తం 4820 మంది బాలబాలికలు హాజరవుతున్నారని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 10 గంటల్లోపు చేరుకోవాలని సూచించారు.

Similar News

News February 25, 2026

హనుమకొండలో సీపీఆర్‌పై అవగాహన

image

ప్రతి ఒక్కరికి సీపీఆర్‌పై అవగాహన ఉంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడవచ్చునని HNK డి.ఎం.హెచ్.ఓ డా. ఏ.అప్పయ్య ఆన్నారు. 100 రోజుల హెల్త్ క్యాంపెన్‌లో భాగంగా హనుమకొండ డి.ఎం.హెచ్.ఓ కార్యాలయంలో ఆర్బిఎస్కే‌కు చెందిన ఐదు బృందాల డాక్టర్లు, సిబ్బందికి సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన వారు పాఠశాలలో సీపీఆర్‌పై శిక్షణ అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

News February 25, 2026

‘మీ టికెట్’తో ఆర్టీసీ సహా పలు సేవలు

image

TG: రాష్ట్రంలో ప్రయాణికుల సౌలభ్యం కోసం అన్ని టికెట్లు ఒకేచోట బుక్ చేసుకొనేలా ప్రభుత్వం ‘మీ టికెట్’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. RTC, మెట్రో రైలు టికెట్లు, పాసులు, దేవాలయాలు, టూరిస్టు ప్రాంతాలు, ఫారెస్టు సఫారీ, హైదరాబాద్‌లోని పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, EV ఛార్జింగ్ స్టేషన్లకు సంబంధించి టికెట్లను ముందే యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. క్యూలైన్లలో నిల్చోవాల్సిన అవసరం లేకుండా యాప్ ద్వారా పొందొచ్చు.

News February 25, 2026

అనకాపల్లి: ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 585 మంది గైర్హాజర్

image

జిల్లాలో 34 ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో బుధవారం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షకు 585 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 13,939 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 13,354 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు అధికారి ఎం. వినోద్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు పగడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అసౌకర్యం కలక్కుండా ఏర్పాట్లు చేశామన్నారు.