News May 2, 2024

ఈనెల 6 నుంచి మోస్తరు వర్షాలు

image

TG: మండుతున్న ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. ఈనెల 6 నుంచి కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నల్గొండ జిల్లా గూడపూర్‌లో అత్యధికంగా 46.6 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది.

Similar News

News March 21, 2026

వారి రిటైర్మెంట్ వయసు పెంపు!

image

AP: ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూళ్ల ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్(లోకేశ్, పయ్యావుల, నారాయణ) నిర్ణయం తీసుకున్నారు. దీంతో త్వరలోనే జీవో వెలువడనుంది. తమ విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

ప్లే విత్ ఫైర్.. ప్లే విత్ పేషన్స్

image

మరో వారంలో IPL-19 ప్రారంభం కానుంది. తొలి మ్యాచులో RCBని SRH ఢీకొట్టనుంది. ఈసారి సన్‌రైజర్స్ ‘PlayWithFire’ నినాదంతో బరిలోకి దిగుతోంది. ఫైర్ అవసరమే అయినా ఆ జట్టుకు ఓపిక(Patience) కూడా ఉండాలని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఓపెనర్లు ఫైర్ చూపించాలని, మిడిల్ ఆర్డర్ పేషన్స్‌తో ఆడాలని కోరుతున్నారు. తద్వారా ప్రత్యర్థిపై పైచేయి సాధించి, భారీ స్కోర్‌కు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మీరేమంటారు?