News February 21, 2026

కామారెడ్డికి రానున్న BJP రాష్ట్ర అధ్యక్షుడు

image

కామారెడ్డిలో చోటుచేసుకుంటున్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కామారెడ్డికి రానున్నారు. సాయంత్రం మూడు గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకొని రమణారెడ్డితో భేటీ కానున్నట్లు సమాచారం. ఉద్రిక్తత పరిస్థితులకు గల కారణాలను తెలుసుకోనున్నారు.

Similar News

News February 22, 2026

వనపర్తి: శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులు.. అద్దెకు తీసుకోవాలని డీఎం పిలుపు

image

వివాహాలు, విహారయాత్రల కోసం తక్కువ ధరకు ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇవ్వనున్నట్లు వనపర్తి డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు. ప్రైవేటు వాహనాల కంటే తక్కువ ఖర్చుతో పాటు, డ్రైవర్ బత్తా చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. సురక్షిత ప్రయాణం కోసం ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:
79957 01851, 96765 63377, 73828 29313

News February 22, 2026

విశాఖ: పాత కక్షలతో కత్తితో దాడి..

image

జగదాంబ జంక్షన్ వద్ద శనివారం రాత్రి రౌడీషీటర్ అప్పులరాజుపై ఆటో డ్రైవర్ కత్తితో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. పాత గొడవల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కేసు నమోదు చేసిన మహారాణిపేట పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామని సీఐ దివాకర్ యాదవ్ తెలిపారు.

News February 22, 2026

కాసేపట్లో గుంటూరు రానున్న సీఎం

image

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరికొద్ది సేపట్లో గుంటూరు రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ బందోబస్తు చర్యలు చేపట్టింది. ఎస్పీ వకుల్ జిందాల్ బందోబస్తు ఏర్పాట్లతో పాటు హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎస్పీతో పాటు డీఎస్పీ అజీజ్, తదితరులు ఉన్నారు.