News February 21, 2026
AUSWతో మ్యాచ్.. భారత్ స్కోర్ 176/6

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతున్న మూడో టీ20లో భారత్ 176/6 స్కోర్ చేసింది. స్మృతి మంధాన 55 బంతుల్లో 82(8 ఫోర్లు, 3 సిక్సర్లు), జెమీమా 59, రిచా ఘోష్ 18, షెఫాలీ వర్మ 7 రన్స్ చేశారు. టీమ్ ఇండియా చివరి 9 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయింది. 3 టీ20ల సిరీస్‌లో IND, AUSలు చెరో మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది.
Similar News
News March 1, 2026
చామంతి తోటలో నత్తల నివారణకు సూచనలు

చామంతి తోటల్లో నత్తల దాడితో కొన్ని ప్రాంతాల్లో రైతులు నష్టపోతున్నారు. వీటి నివారణకు మెథియోకార్బ్ గుళికలు 2KGలకు, అంతే మోతాదులో వరి తవుడు కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి నత్తలు తిరిగే దారిలో మొక్కల చుట్టూ చల్లాలి. అజాడిరక్టిన్(3000 P.P.M) 10ML లేదా కుంకుడు పొడి 60 గ్రాములను లీటరు నీటికి కలిపి నత్తలు తిరిగే మార్గంలో పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
News March 1, 2026
36ఏళ్లు ఇరాన్‌ను శాసించిన సుప్రీంలీడర్ – 1/2

ఇరాన్‌ను 36ఏళ్లు తన ఉక్కుపిడికిలితో పాలించిన నియంత అలీ ఖమేనీ. 1939లో ఇరాన్‌లోని మషహద్‌లో ఓ పేద కుటుంబంలో ఖమేనీ జన్మించారు. ఇస్లామిక్ తిరుగుబాటు నాయకుడు ఖొమైనీకి శిష్యుడిగా మారి ఇరాన్ షా ప్రభుత్వాన్ని పడగొట్టడంలో ఖమేనీ ముఖ్యపాత్ర పోషించారు. తన గురువు ఖొమైనీ నాయకత్వంలో 1979లో ఇరాన్‌లో ఇస్లామిక్ రూల్ స్థాపించగలిగారు. 1980-88 మధ్య ఇరాక్‌తో ఎనిమిదేళ్లు యుద్ధం సాగినా ఇరాన్ పట్టును సడలనివ్వలేదు.
News March 1, 2026
36ఏళ్లు ఇరాన్‌ను శాసించిన సుప్రీంలీడర్ – 2/2

1989లో ఇరాన్ తొలి సుప్రీంలీడర్ ఆయతొల్లా రుహోల్లా ఖొమైనీ చనిపోయాక ఖమేనీ పగ్గాలు అందుకున్నారు. సుప్రీంలీడర్ హోదా కోసం రాజ్యాంగాన్ని మార్పించారు. US సహా విదేశాల ఆంక్షలు, ఒత్తిళ్లు కొనసాగినా పట్టువీడలేదు. నిరసనలు చెలరేగితే నిర్దాక్షిణ్యంగా వాటిని అణచివేసేవారు. హెజ్బొల్లా, హౌతీ వంటి మిలిటెంట్ సంస్థలను పోషించి మిడిల్‌ఈస్ట్‌ను శాసించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఖమేనీ తర్వాత ఎవరు అనేది చర్చనీయాంశమైంది.


