News May 2, 2024
HYD: ట్యాంక్‌బండ్‌లో దూకిన యువకుడు.. కాపాడిన DRF

ట్యాంక్‌బండ్‌లో ఓ యువకుడి ప్రాణాలను GHMC DRF సిబ్బంది కాపాడారు. గురువారం ఉదయం అప్పర్ ట్యాంక్‌బండ్ మీదకొచ్చిన వంశీ అనే యువకుడు నీళ్లలోకి దూకాడు. మునిగిపోతున్న అతడిని గమనించిన DRF సిబ్బంది అప్రమత్తమయ్యారు. హుటాహుటినా ట్యాంక్‌బండ్‌లోకి దిగి అతడిని బయటకు తీసుకొచ్చారు. లేక్ పోలీసులకు అప్పగించారు. వ్యక్తిగత సమస్యల కారణంగా సూసైడ్‌కు యత్నించినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 3, 2026
HYD: మహిళా దారుణ హత్య

వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం ఎల్లకొండ సమీపంలో మహిళా దారుణ హత్యకు గురైంది. ఎత్తిరాజ్‌పల్లి గ్రామానికి చెందిన బాలమణిని(45) గుర్తుతెలియని దుండగులు గొంతుకోసి అత్యంత క్రూరంగా హత్య చేశారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న మూడు తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎస్సై పుండ్లిక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News March 3, 2026
HYD: సిటీకి కొత్త సింగారం!

నగరం పాత, కొత్తల కలబోతగా మారుతోంది. మార్చి 4న హోలీ వేడుకలు, హెరిటేజ్ రన్ వంటి ఈవెంట్లతో నగరం కళకళలాడుతోంది. ఫుడ్ విషయంలోనూ మన తెలుగు రుచులకే పట్టం కడుతున్నారు. చిరుధాన్యాల వంటకాలతో పాటు కొరియన్ ఫుడ్ తెగ ట్రెండ్ అవుతోంది. ఆర్గానిక్ ఫ్యాషన్, టెక్ సదస్సులతో హైటెక్ సిటీ కొత్త పుంతలు తొక్కుతోంది. పలు చోట్ల వేడుకలకు మ్యూజిక్ సిస్టమ్, గ్రౌండ్‌లోనే రెయిన్ డాన్స్‌కు వాటర్ షవర్లు ఏర్పాటు చేస్తున్నారు.
News March 3, 2026
HCUలో PhDకి దరఖాస్తు చేసుకోండి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ (HCU) PhD కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దాదాపు 13 కోర్సుల్లో కోర్సులు చేసేందుకు అవకాశముంది. ఆసక్తి, అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. మార్చి 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంది. కోర్సులు, అర్హత వివరాలు, ఫీజు తదితర వివరాలు వర్సిటీ వెబ్‌సైట్‌లో <


