News May 2, 2024

పాలకొండకు చేరుకున్న పవన్ కళ్యాణ్

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు పాలకొండ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కొద్దిసేపటి క్రితమే పవన్ పాలకొండకు చేరుకున్నారు. పవన్‌కు దారి పొడవున అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పవన్ ప్రజలకు అభివాదం చేస్తూ వారాహిలో ముందుకు వెలుతున్నారు. మరికొద్ది సేపట్లో పవన్ ప్రసంగించనున్నారు. పవన్ వెంట పలువురు జిల్లా నేతలు ఉన్నారు.

Similar News

News March 13, 2026

ఫైల్స్ క్లియెరెన్స్‌లో అచ్చెన్న బెస్ట్

image

పరిపాలన విభాగంలో ఫైల్స్ క్లియరెన్స్ అన్నది కీలకం. రాష్ట్ర మంత్రుల్లో మన జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు ఫైల్స్ క్లియరెన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వం ఏర్పడి 20 నెలల్లో 3,362 ఫైల్స్‌ను క్లియర్ చేశారు. 551 గంటలు ఫైల్స్ క్లియరెన్స్‌కు సమయం తీసుకున్నారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ల సమావేశంలో మంత్రిని ప్రత్యేకంగా అభినందించారు.

News March 13, 2026

జలుమూరులో అగ్ని ప్రమాదం

image

జలుమూరు మండలం నామాలపేటలో గురువారం సాయంత్రం జీడీ, నీలగిరి తోటలు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న కోటబొమ్మాళి ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గ్రామ రైతులు ఎన్.భాస్కరరావు, ఎన్.లక్ష్మీనారాయణ, సీహెచ్ రత్నాలు, రమేశ్‌లకు చెందిన నాలుగు ఎకరాలు ఈ ప్రమాదంలో కాలిపోయాయి. సుమారు ఆస్తి నష్టం రూ.50వేల వరకు ఉంటుందని సిబ్బంది అంచనా వేశారు.

News March 13, 2026

SKLM: రైల్వే రిక్రూట్మెంట్ గ్రూప్ డి పరీక్షలకు ఉచిత శిక్షణ

image

రైల్వే రిక్రూట్ మెంట్ గ్రూప్ డి – 2026 పరీక్షలకు ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థులు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా BC సంక్షేమ అధికారి ఎపీ బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు ఇ. అనూరాధ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను మార్చి 23వ తేదీలోగా ఎ.సి.బి.సి.స్టడీ సర్కిల్, శ్రీకాకుళంకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందన్నారు. 100 మంది అభ్యర్ధులకు 2 నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు.