News February 21, 2026

అక్రిడిటేషన్ కోసం జిల్లా కమిటీ ఏర్పాటు: గద్వాల కలెక్టర్

image

జిల్లాలోని మీడియా ప్రతినిధులకు 2026-28 సంవత్సరాల కాలానికి కొత్త అక్రిడిటేషన్లు జారీ చేయడానికి నూతనంగా జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అసోసియేషన్లు, సంఘాలు తమ ప్రతినిధి పేరును లెటర్ ప్యాడ్‌పై రాసి ఫిబ్రవరి 23 ఉదయం 11 గంటల్లోపు జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

Similar News

News February 24, 2026

విజయవాడలో బాలుడిపై కుక్కల దాడి.. తీవ్ర గాయాలు

image

విజయవాడ వన్ టౌన్ పరిధి వాగు సెంటర్ వద్ద బాలుడిపై కుక్కలు దాడి చేసిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. బాలుడు రాచకొండ రుషి (9) ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి. అతణ్ని GGHకి తరలించగా వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఫేస్‌కి ప్లాస్టిక్ సర్జరీ చెయ్యాలని సూచించారు. నగరంలో రోజు రోజుకి కుక్క కాట్లు అధికమవుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

News February 24, 2026

ఉగాదిలోపు ఇందిరమ్మ ఇళ్లు పూర్తి కావాలి: కలెక్టర్

image

జిల్లాలో స్లాబ్ దశలో ఉన్న 2,700 ఇందిరమ్మ ఇళ్లను ఉగాది నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్‌తో కలిసి ఆయన పనులను సమీక్షించారు. గృహ ప్రవేశాలకు సిద్ధం చేయడంతో పాటు డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పించాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అధికారులకు స్పష్టం చేశారు.

News February 24, 2026

వరంగల్ సూపర్ స్పెషాలిటీపై హరీశ్‌రావుకు మంత్రి దామోదర్ కౌంటర్

image

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన విమర్శలను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఖండించారు. బీఆర్‌ఎస్ హయాంలో పనులు 50% కూడా పూర్తికాలేదని, అశాస్త్రీయంగా వ్యయం పెంచారని ఆరోపించారు. తమ ప్రభుత్వం రూ. 300 కోట్లు ఆదా చేసి పనులు వేగవంతం చేసిందన్నారు. 35 విభాగాలతో, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్, కేన్సర్ చికిత్స సహా ఆధునిక సేవలతో త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.