News February 21, 2026

తిరుమల శ్రీవారితో వైసీపీ రాజకీయం చేస్తుంది: మంత్రి సుభాశ్

image

తిరుమల శ్రీవారిని వైసీపీ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ ఆరోపించారు. శనివారం మంత్రి కార్యాలయం నుంచి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. వేంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవని మంత్రి ధ్వజమెత్తారు. భక్తుల మనోభావాలను వైసీపీ నాయకులు పదేపదే దెబ్బతీస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు బుద్ధి మార్చుకోవాలని ఆయన వ్యాఖ్యనించారు.

Similar News

News February 23, 2026

TGPSC వన్ టైమ్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు

image

TG: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) అప్‌డేట్ చేసుకునే గడువును మార్చి 25కు పొడిగిస్తున్నట్లు TGPSC ప్రకటించింది. ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌లో నింపే సమాచారానికి ఓటీఆర్ డేటానే ప్రాథమిక ఆధారం అవుతుందని తెలిపింది. అధికారిక వెబ్‌సైట్ <>https://www.tgpsc.gov.in<<>> ద్వారా తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.

News February 23, 2026

SKLM: డయేరియా గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్

image

శ్రీకాకుళం నగర పరిధిలో ప్రబలిన ధైర్య ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ దినకర్ పుండ్కర్ సోమవారం పర్యటించారు. కాకివీధి, గుడివీధి, దమ్మలవీధి, మంగువారి తోట గ్రామాల్లో డయేరియా ప్రబలి పలువురు అస్వస్థకు గురయ్యారు. నీరు కాచి చల్లార్చి తాగాలని, నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తినరాదని సూచనలు చేశారు. ఆయా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తామని 2,3 రోజులు ఇంట్లో నిలువ ఉన్న నీరు వాడకూడదన్నారు.

News February 23, 2026

కట్టుదిట్టంగా గోదావరి పుష్కరాల నిర్వహణ: కలెక్టర్

image

రాబోయే గోదావరి పుష్కరాలు-2027ను అత్యంత వైభవంగా, పకడ్బందీ ప్రణాళికతో నిర్వహిస్తామని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. సోమవారం దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. కాళేశ్వరంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏడు ప్రధాన శాఖల సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.