News May 2, 2024

విశాఖ: 1989లో తండ్రులు, 2024లో కొడుకులు

image

గాజువాకలో పోటీ పడుతున్న అమర్నాథ్, పల్లా శ్రీనివాసరావుల తండ్రులు 1989లో ప్రత్యర్థులుగా బరిలో దిగారు. వారు పెందుర్తి నుంచి పోటీ చేస్తే.. వారి వారసులు గాజువాకలో పోటీ పడుతున్నారు. 1989లో పెందుర్తి నుంచి గుడివాడ గురునాధ‌రావు కాంగ్రెస్ నుంచి, ప‌ల్లా సింహాచ‌లం TDP నుంచి పోటీ చేయగా, గురునాధరావు విజ‌యం సాధించారు. వారసుల్లో ఎవరు పైచేయి సాధిస్తారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Similar News

News July 5, 2025

విశాఖలో ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డు సస్పెండ్: సీపీ

image

విశాఖలో ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డును సస్పెండ్ చేస్తూ సీపీ శంఖబ్రత బాగ్చీ ఉత్తర్వులు జారీ చేశారు. కంచరపాలెం స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్స్ సన్నీబాబు, ఎస్.రామకృష్ణ, హోంగార్డు గురునాయుడు విధి నిర్వహణలో ఉండగా లారీలు ఆపి అక్రమ వసూలు చేసినట్లు కమిషనర్ దృష్టికి వెళ్లింది. దీంతో దర్యాప్తు చేసి ముగ్గురిని సస్పెండ్ చేశారు. పోలీస్ సిబ్బంది అక్రమాలకు పాల్పడితే వాట్సాప్‌లో తనను సంప్రదించాలన్నారు.

News July 5, 2025

విశాఖ: ‘జులై 10న దుకాణాలకు బహిరంగ వేలం’

image

GVMC జోన్-4 పరిధిలో దుకాణాలు, కళ్యాణ మండపాలు, రోడ్ సైడ్ మార్కెట్లకు జులై 10న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు శుక్రవారం తెలిపారు. జోన్ పరిధిలోని డైక్స్ ట్యాంక్ వాణిజ్య సముదాయము, జగదాంబ వాణిజ్య సముదాయం, పాత బస్ స్టాండ్ దుకాణాములు, పలు వార్డుల్లో వ్యాపార సముదాయాలను వేలం వేస్తామన్నారు. ఆసక్తి ఉన్నవారు జీవీఎంసీ జోన్-4 జోనల్ ఆఫీసు వద్ద జులై 10న ఉ.11గంటలకు హాజరుకావాలన్నారు.

News July 5, 2025

విశాఖ గోల్డ్ వ్యాపారులకు హెచ్చరిక

image

విశాఖలో ఆభరణాల వ్యాపారులకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (B.I.S.) హాల్ మార్కింగ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. నిబంధనలు గురించి ఆభరణాల వ్యాపారులకు వివరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చిక్కుడు తప్పవని B.I.S. దక్షిణ ప్రాంత డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ ఖన్నా హెచ్చరించారు. B.I.S. కేర్ మొబైల్ యాప్ గురించి వివరించారు.‌ విశాఖ నుంచి 100 మంది గోల్డ్ వ్యాపారులు హాజరయ్యారు.