News May 2, 2024
కాంగ్రెస్ గెలిస్తే రిజర్వేషన్లు పెరుగుతాయి: రేవంత్

TG: కాంగ్రెస్ గెలిస్తే రిజర్వేషన్లు పెరుగుతాయని, BJP గెలిస్తే రద్దవుతాయని CM రేవంత్ అన్నారు. ‘కులగణన చేయాల్సి వస్తుందనే కేంద్రం జనాభా లెక్కలు చేపట్టడం లేదు. రిజర్వేషన్లపై మాట్లాడినందుకే నాపై కేసు పెట్టారు. రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందనే 2021లో జనాభా లెక్కలు చేపట్టలేదు. దేశంలో 15 రాష్ట్రాలు ఆమోదిస్తే రిజర్వేషన్లు రద్దు చేయవచ్చు. అందుకే BJP 8 రాష్ట్రాలను లాక్కుంది’ అని ఆసిఫాబాద్ సభలో ఆరోపించారు.
Similar News
News March 13, 2026
శుభ సమయం (13-3-2026) శుక్రవారం

➤ తిథి: బహుళ దశమి తె.5.51 వరకు
➤ నక్షత్రం: పూర్వాషాఢ రా.1.06 వరకు
➤ శుభ సమయాలు: ఉ.6.11-8.32, మ.1.18-సా.4.04, సా.5.04-సా.6.03
➤ రాహుకాలం: ఉ.10.30-మ.12.00
➤ యమగండం: మ.3.00-సా.4.30
➤ దుర్ముహూర్తం: ఉ.8.33-ఉ.9.12, మ.12.30-మ.1.18
➤ వర్జ్యం: ఉ.9.22-ఉ.11.07
➤ అమృత ఘడియలు: రా.7.51-రా.9.36
News March 13, 2026
పశ్చిమాసియాలో పరిస్థితులపై ఇరాన్ ప్రెసిడెంట్‌తో మోదీ చర్చలు

పశ్చిమాసియాలో పరిస్థితులపై ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్‌తో చర్చించినట్లు PM మోదీ ట్వీట్ చేశారు. ఉద్రిక్తతలు పెరగడం, పౌరుల ప్రాణనష్టం, మౌలిక సదుపాయాల ధ్వంసంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారత పౌరుల భద్రత, అడ్డంకులు లేని ఇంధన సరఫరా తమకు అత్యంత ప్రాధాన్యత అంశాలని మోదీ స్పష్టం చేశారు. భారత్ ఎల్లప్పుడూ శాంతికి కట్టుబడి ఉంటుందని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని పెజెష్కియాన్‌ను కోరారు.
News March 13, 2026
TODAY HEADLINES

*LPGపై ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నారు: మోదీ
*దేశంలో గ్యాస్ లభ్యతపై ఆందోళన నెలకొంది: రాహుల్
*పారిశ్రామిక హబ్‌గా ఏపీ: చంద్రబాబు
*నర్సరీ నుంచి 12వ తరగతి విధానం తీసుకొస్తాం: రేవంత్
*TG: ఈనెల 15 నుంచి ఒంటిపూట బడులు
*16న విచారణకు హాజరు కావాలని కవితకు సీబీఐ నోటీసులు
*US నౌకపై ఇరాన్ దాడి.. ఇండియన్ మృతి
*గ్యాస్ కొరత నేపథ్యంలో రాష్ట్రాలకు కిరోసిన్ సరఫరా పెంపు


