News May 2, 2024
నిజామాబాద్: రేపటి నుంచి నాలుగు రోజుల పాటు హోమ్ ఓటింగ్

ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఈ నెల 3, 4, 5, 6 తేదీల్లో హోమ్ ఓటింగ్ నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లు చేశామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. పార్లమెంటు సెగ్మెంట్‌లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1758 మంది ఓట్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని వినియోగించుకోనున్నారని ఆయన వివరించారు.
Similar News
News March 13, 2026
NZB: ‘బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకానికి చర్యలు తీసుకోవాలి’

బూత్ స్థాయి ఏజెంట్ల నియామకానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ప్రత్యేక ఇంటెన్సివ్ పునః పరిశీలన (SRI)లో భాగంగా మ్యాపింగ్ ప్రక్రియ, లక్ష్యం మేరకు మ్యాపింగ్ పూర్తి చేసే ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారుల, ఏజెంట్ల నియామకం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో రాష్ట్ర ఎన్నిక ప్రధాన అధికారి VC నిర్వహించారు.
News March 13, 2026
‘అవకాశం దొరికితే మళ్లీ మళ్లీ ఇందూరు తిరుమలకు వస్తా’

అవకాశం దొరికితే మళ్లీ మళ్లీ ఇందూరు తిరుమలకు వస్తానని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం ఆమె మోపాల్ మండలం నర్సింగ్ పల్లిలోని ఇందూరు తిరుమల క్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. ఆలయం నేపథ్యం తెలుసుకొని తాను సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యానన్నారు. కాగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మేయర్ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.