News May 2, 2024
కోవాగ్జిన్‌పై భారత్ బయోటెక్ కీలక ప్రకటన

కోవిషీల్డ్‌తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్న ప్రకటనతో మిగతా వ్యాక్సిన్లు తీసుకున్నవారిలోనూ ఆందోళన మొదలైంది. దీంతో కోవాగ్జిన్‌పై భారత్ బయోటెక్ ప్రకటన చేసింది. నాణ్యతా ప్రమాణాలు పాటించి ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని దీన్ని రూపొందించినట్లు తెలిపింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన తర్వాతే కోవాగ్జిన్‌ను విడుదల చేశామంది. తమ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని వెల్లడించింది.
Similar News
News March 24, 2026
శివలీల.. పసుపు వేస్తే కుంకుమ అవుతుంది!

TG: హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయం అద్భుత ఆధ్యాత్మిక నిలయం. ఇక్కడి శివలింగంపై రాత్రి వేళ భక్తితో పసుపు వేస్తే ఉదయానికి అది కుంకుమగా మారుతుందని భక్తుల విశ్వాసం. ఇది ఆ మహాశివుడి లీలతో పాటు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహమని నమ్మకం. కాకతీయుల కాలం నాటి ఈ పురాతన దేవాలయంలోని ఈ వింతను చూసేందుకు భక్తులు పోటెత్తుతారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(29/100)
News March 24, 2026
RDTకి అనుమతులు.. CBN క్రెడిట్ చోరీ: జగన్

AP: RDTకి FCRA <<19461876>>అనుమతుల<<>> విషయంలో CM CBN క్రెడిట్ చోరీకి పాల్పడడం ఆశ్చర్యంగా ఉందని జగన్ ట్వీట్ చేశారు. ‘నిజంగా ఆయన కృషి చేసి ఉంటే 2025 APRలో నిలిచిపోయిన పర్మిషన్ల రెన్యువల్‌కు ఏడాదికాలం ఎందుకు పట్టింది? CBN పట్టించుకోకపోవడం వల్లే YCP, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజలు ఉద్యమం చేయాల్సి వచ్చిందన్నది వాస్తవం కాదా’ అని ప్రశ్నించారు. పర్మిషన్లు రెన్యువల్ చేసినందుకు PM మోదీ, అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు.
News March 24, 2026
యుద్ధం.. మోదీకి ట్రంప్ ఫోన్

ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేశారు. పశ్చిమాసియా యుద్ధం, రెండు దేశాలపై దాని ప్రభావం గురించి ఇద్దరు నేతలు చర్చించారు. హార్ముజ్‌లో నౌకలు చిక్కుకోవడం, జలసంధిని తెరిపించాల్సిన అవసరంపై మాట్లాడుకున్నారు. మరోవైపు యుద్ధం వల్ల దేశంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రజలు సిద్ధంగా ఉండాలని మోదీ ఇప్పటికే దేశ <<19465598>>ప్రజలకు<<>> పిలుపునిచ్చారు.


