News May 2, 2024

HYD: పోస్టులు పెడుతున్నారా.. జాగ్రత్త సుమా!

image

HYD, ఉమ్మడి RRలో సామాజిక మాధ్యమాల్లో ప్రచార కార్యక్రమాలను అణువణువు పరిశీలించడానికి మీడియా మానిటరింగ్ బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో కలెక్టర్, అదనపు కలెక్టర్, పోలీస్ సిబ్బంది, సామాజిక మాధ్యమాల నిపుణుడు, మీడియా రిపోర్టర్, సీనియర్ సిటిజన్,జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి సభ్యులుగా ఉంటారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌కు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వ్యక్తికి నోటీసులు జారీచేసి చర్యలు తీసుకుంటారు.

Similar News

News April 7, 2026

HYD: 108లో EMT ఉద్యోగాల ఇంటర్వ్యూలు

image

EMRI(108) సంస్థలో EMT పోస్టుల భర్తీకి ఏప్రిల్ 8న(బుధవారం) ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. B.Sc(BZC), ANM, DMLT, MLT, GNM, MPHA అర్హతలున్న 30ఏళ్లలోపు అభ్యర్థులు హాజరుకావచ్చు. ఉ.10 నుంచి మ.3 గంటల వరకు కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రి వద్ద ఉన్న 108 రీజినల్ ఆఫీస్‌లో ఇంటర్వ్యూలు జరుగుతాయి. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలతో రావాలి. మరిన్ని వివరాలకు 9154248904కు ఫోన్ చేయవచ్చు. SHARE IT.

News April 7, 2026

HYD: అలర్ట్.. నల్లాలకు మోటార్లు.. రూ.5,000 FINE..!

image

నల్లాలకు మోటార్లు బిగించి లో-ప్రెజర్ వాటర్ సప్లైకి కారణమవుతున్న వారిపట్ల HMWSSB సీరియస్‌గా ఉంది. అలా చేసేవారికి రూ.5000 FINEతోపాటు మోటార్‌ను సీజ్ చేస్తామని MD అశోక్ రెడ్డి తెలిపారు. అందరికీ సమపాళ్లలో నీళ్లందాలనే ఈ చర్యలు ప్రారంభించనున్నట్లు చెప్పారు. వేసవి ముగిసేవరకు లైన్‌మెన్ నుంచి MD పర్యవేక్షణలో ఈ ఆకస్మిక తనిఖీలు ఉంటాయన్నారు. నగరంలో ఇలా 40శాతం నల్లాలకు మోటార్లు ఫిక్స్ చేస్తున్నట్లు గుర్తించారు.

News April 7, 2026

HYD: బాలికపై అత్యాచారం.. నిందితుడికి జీవితఖైదు..!

image

కుషాయిగూడ సాయినగర్‌లో 2010లో జరిగిన మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు కాకర్ల అనిల్ కుమార్‌కు జీవితఖైదు పడింది. 2012 నుంచి పెండింగ్‌లో ఉన్న నాన్-బెయిలబుల్ వారెంట్ ఆధారంగా 2025 నవంబరులో నిందితుడిని కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రెడ్డి విజయవాడలో అరెస్ట్ చేశారు. నేరేడ్‌మెట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణలో అనిల్ నేరం చేసినట్లు తేలడంతో న్యాయమూర్తి జీవితఖైదుతో పాటు రూ.1000 జరిమానా విధించారు.