News May 2, 2024
కామారెడ్డి జిల్లాలో 4,546 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

ఎన్నికల విధులు, ఇతర అత్యవసర విధులు నిర్వహిస్తున్న 4,546 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని KMR జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ తెలిపారు. జుక్కల్ నియోజకవర్గంలో 1,081, ఎల్లారెడ్డిలో 1,298, కామారెడ్డి నియోజకవర్గంలో 2,167 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు కలెక్టర్ వివరించారు.
Similar News
News September 12, 2025
సాయంత్రం 4 గంటలకు శ్రీరాంసాగర్ గేట్లు ఓపెన్

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి వస్తున్న వరద ప్రవాహాన్ని శుక్రవారం సాయంత్రం 4 గంటల తర్వాత ఏ సమయంలోనైనా స్పిల్‌వే గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఎస్ఈ జగదీశ్ తెలిపారు. ప్రాజెక్టు దిగువన ఉన్న గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పశువుల కాపరులు, మత్స్యకారులు, రైతులు నదిని దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు.
News September 12, 2025
KMR: యువకుడి మోసం.. యువతి ఆత్మహత్య

ప్రేమలో మోసపోయానని మనస్తాపంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఎల్లారెడ్డి మండలం సబ్దల్ పూర్‌లో బుధవారం జరిగింది. ఎస్సై బొజ్జ మహేష్ వివరాలు.. గ్రామానికి చెందిన సావిత్రి(19) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. శెట్టిపల్లి సంగారెడ్డికి చెందిన ప్రదీప్ ప్రేమ పేరుతో మోసం చేశాడని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News September 12, 2025
బోధన్ ఎస్బీఐలో నగదు చోరీ

బోధన్ పట్టణంలోని ఎస్బీఐలో చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ వెంకటనారాయణ వివరాల ప్రకారం.. ఈ నెల 8వ తేదీన బ్యాంకుకు వచ్చిన వ్యక్తులు రూ.ఐదు లక్షలు డిపాజిట్ చేసి వెళ్లిపోయారు. తరువాత నగదు క్యాషియర్ వద్ద కనిపించలేదు. దీంతో గురువారం బ్యాంకు సిబ్బంది బోధన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్యాంకులోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.